Aries Yearly Horoscope 2025: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!
Aries Horoscope New Year 2025 In Telugu: పాత సంవత్సరం 2024కి ముగింపు పలికి కొత్త ఏడాది 2025కి ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మరి కొత్త ఏడాదిలో మీ రాశి ఫలం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...
Aries Yearly horoscope 2025: 2024 కన్నా 2025లో మేష రాశివారికి అంత అనుకూల ఫలితాలు లేవు. జనవరి 2025, ఫిబ్రవరి 2025లో ఉద్యోగం, వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి కానీ మార్చి చివరి నుంచి సమస్యలు మొదలవుతాయి. కుంభ రాశినుంచి శని మీన రాశిలో ప్రవేశించడంతో మేష రాశివారిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం, ఆరోగ్యం, కుటుంబ పరంగా ఒత్తిడి పెరుగుతుంది.
మార్చి ఎండింగ్ నుంచి శని సంచారం మీ రాశి నుంచి 11 వ స్థానంలో ఉంటుంది. ఈ ప్రభావంతో డబ్బు, ఆరోగ్యం, కుటుంబం , వృత్తి పరంగా వరుస సవాళ్ల ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోతారు..చేపట్టిన ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతాయి. అనుకోని ఒత్తిడి మిమ్మల్నిపట్టి కుదిపేస్తుంది. ఉద్యోగంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించా ఇబ్బందులు తప్పవు, వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ధైర్యంగా అడుగేసినా నష్టాలే ఎదురవుతాయి.
Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!
2025 ఏప్రిల్ నెల మేష రాశివారికి మిశ్రమంగా ఉంటుంది..
2025 మే మెలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ నెలలో బృహస్పతి మిథునంలో సంచరిస్తాడు...మేష రాశినుంచి అపరాధ స్థానంలో సంచారం ఫలితంగా మీ జీవితంలో మార్పులు వేగంగా కనిపిస్తాయి. 2025 లో రాశి పరివర్తనం చెందే రాహు-కేతు సంచారం కూడా మీకు శుభ ఫలితాలను ఇవ్వడం లేదు.
మే తర్వాత రాహు కేతు సంచారం ప్రభావం మీ ఆదాయంపై పడుతుంది. జూన్ నెలలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. ఆదాయ మూలాలు తగ్గుతాయి, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థికంగా నష్టాలు పెరుగుతాయి. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సలహాలు స్వీకరించడం ద్వారా కొంత ఉపశమనం ఉంటుంది
Also Read: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!
గత మూడు నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి జూలై నెలలో కొంత ఉపశమనం పొందుతారు.ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు లేదంటే బదిలీలు ఉంటాయి. అది కూడా మీరు ఊహించకుండానే జరుగుతుంది
ఆగస్టు 2025లో అనుకోని ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సెప్టెంబర్ 2025- అక్టోబర్ 2025 ఈ రెండు నెలలు మేషరాశివారికి కొంత ఉపశమనం ఉంటుంది. శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. ఈ నెలలో వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
నవంబర్ 2025 - డిసెంబర్ 2025 ఈ రెండు నెలలు ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి చేసుకోవాలి అనుకునేవారికి సంబంధాలు నిశ్చయం అవుతాయి. ఈ నెలలో ఆధ్యాత్మిక యాత్ర చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. కోపం తగ్గించుకోవడం మీ ఆరోగ్యానికి, ఆనందానికి మంచిది...
Also Read: ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.