అన్వేషించండి

Sun Transit in Sagittarius 2024: ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!

Surya Gochar Dhanu Rashi 2024: ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న సూర్యుడు డిసెంబరు 16 నుంచి జనవరి 14 వరకూ ధనస్సులో సంచరిస్తాడు. ఈ పరివర్తనం కొన్ని రాశులవారికి శుభఫలితాలు ఇస్తోంది...

Sun Transits Sagittarius 16 Dec 2024 till 14 Jan 2025:  జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని గ్రహాల రాజుగా సూచిస్తారు. ప్రత్యక్షదైవంగా పూజలందుకునే ఆదిత్యుడు నెల రోజులకు ఓ సారి రాశి పరివర్తనం చెందుతాడు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న సూర్యుడు..డిసెంబరు 16న ధనస్సు రాశి (Sagittarius) లోకి ప్రవేశిస్తాడు. ఆ రోజు ధనుస్సంక్రాంతి..ఇక జనవరి 14న ధనస్సు నుంచి మకర రాశి  (Capricorn ) లోకి అడుగుపెడతాడు. ఆ రోజే మకర సంక్రాంతి (Makar Sankranti 2025). సూర్య సంచారం నెలకోరాశిలో ఉండడం వల్ల ఏటా మకర సంక్రాంతి తేదీల్లో మార్పులుండవు. 

దేవతల గురువైన బృహస్పతి ( Jupiter)  అధిపతిగా ఉన్న ధనస్సు లోకి సూర్యుడు రాశి పరివర్తనం చెందడం వల్ల  కొన్ని రాశులవారికి అదృష్టాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులవారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం,విద్య, వ్యక్తిగత జీవితంలో శుభఫలితాలు పొందుతారు.  ఈ సమయంలో మీకు అన్నివిధాలుగా కలిసొస్తుంది...

Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!

కర్కాటక రాశి  (Cancer Horoscope Today)  

ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం కర్కాటక రాశి వారి అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. కోర్టు సంబంధిత కేసుల్లో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉండేవారికి కలిసొచ్చే టైమ్ ఇది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి.ఆర్థికలాభం పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. 

సింహ రాశి  (Leo Horoscope Today)

ధనుస్సు రాశిలో సూర్యుని పరివర్తనం సింహ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు కావడంతో మీపై ఆదిత్యుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. ధనస్సు సూర్య సంచారం ఉన్నన్నిరోజులు మీకు అన్నింటా శుభఫలితాలే ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచ ఉపశమనం లభిస్తుంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలరు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఇంటా బయటా కలిసొచ్చే సమయం ఇది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు శుభసమయం

Also Read: మార్గశిర మాసం నెల రోజులు నిత్యం పఠించాల్సిన స్తోత్రం!

తులా రాశి (Libra Horoscope Today) 
 
సూర్యుడి రాశి పరివర్తనం తులారాశి నుంచి మూడో స్థానంలో ఉంటోంది. ఫలితంగా అన్నీ శుభఫలితాలే. అన్నీ సానుకూల ఆలోచనలు నిండి ఉండాయి. అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనులును అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న టైమ్ కి పూర్తిచేస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు శుభవార్త వింటారు.

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।

తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget