అన్వేషించండి

Harish Rao: బీఆర్ఎస్ లేకుండా తెలంగాణను ఊహించలేం, వచ్చేది మా ప్రభుత్వమే: హరీష్ రావు

BRS silver jubilee celebration | బీఆర్ఎస్ లేకుండా తెలంగాణ రాష్ట్రాని ఊహించలేమని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే అని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

సిద్దిపేట: ‘కాంగ్రెస్ పార్టీ 420 హామీల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. Congress ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే’ అని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేట అంటే ప్రభుత్వము ఓర్వలేని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈరోజు మన పార్టీ పుట్టినరోజు. బీఆర్ఎస్ పార్టీ నేటితో 25వ వసంతంలో అడుగుపెడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్చా స్వాతంత్రాన్ని సాధించిన పార్టీ. సమైక్య పాలకుల అణచివేత నుండి స్వతంత్రం కల్పించిన పార్టీ. ఇదే సిద్దిపేటలో 24 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేసింది. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించింది మన పార్టీ. 
బీఆర్ఎస్ లేకుండా తెలంగాణను ఊహించలేము
పదేండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణను ఊహించలేము. ఈ అభివృద్ధిని ఊహించలేము. బీఆర్ఎస్ అంటే తెలంగాణ  ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పింది గులాబీ జెండా. గులాబీ జెండా పుట్టినరోజును రాష్ట్రమంతా ఘనంగా జరుపుకుంటుంది. రాష్ట్ర ప్రజలందరికీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ అభిమానులు అందరికీ హృదయపూర్వక బీఆర్ఎస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 
200 పెన్షన్ 2000 చేసింది బీఆర్ఎస్
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ఎప్పుడూ ప్రజల పక్షమే. అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించాం. 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి అందించాం. రైతులకు రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను అందించాం. ఇంటింటికి తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ హామీల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉన్నాం. 

రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, 15,000 రైతుబంధు ఎప్పుడు ఇస్తావు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నాం. మహిళలకు 2,500 ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దాని ఊసే ఎత్తలేదు. 4,000 రూపాయల పెన్షన్ అసలే లేదు. ఈరోజు వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభ కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎడ్లబండిపై, పాదయాత్రలు చేస్తూ సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. 

కేసీఆర్ మాటలు విందామనే ఆసక్తితో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ సభ తప్పకుండా విజయవంతం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటుంది. సిద్దిపటలో పెట్టిన వెటర్నరీ కాలేజ్ ను కొడంగల్ కు తరలించుకుపోయారు. శిల్పారామం పనులు పెండింగ్లో పెట్టారు. ఎస్సీ గురుకుల పాఠశాలకు 30 కోట్లతో భవనం శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ఎత్తుకుపోయారు. సిద్దిపేట అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఓర్వలేని పరిస్థితి ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్. అప్పుడు జరిగే అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు. 
అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్
రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడింది. ఆదాయం మందగించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. గతి లేని శృతి లేని సంసారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేకపోతోంది. మరోసారి బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మళ్లీ అధికారంలోకి వచ్చేది, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
Allu Arjun : బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
Allu Arjun : బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
Thaai Kizhavi Teaser : సరికొత్త లుక్‌లో సీనియర్ హీరోయిన్ రాధిక - అస్సలు గుర్తు పట్టలేం కదా...
సరికొత్త లుక్‌లో సీనియర్ హీరోయిన్ రాధిక - అస్సలు గుర్తు పట్టలేం కదా...
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో తిరుప్పరకుండ్రం మంటలు - హిందూత్వ భావోద్వేగం అంటుకున్నట్లేనా?
తమిళనాడు రాజకీయాల్లో తిరుప్పరకుండ్రం మంటలు - హిందూత్వ భావోద్వేగం అంటుకున్నట్లేనా?
Govt New Rule : వాట్సాప్‌లో బ్యాన్‌ అయితే వేరే యాప్‌లలో బ్లాక్! త్వరలో అమల్లోకి కొత్త రూల్‌!
వాట్సాప్‌లో బ్యాన్‌ అయితే వేరే యాప్‌లలో బ్లాక్! త్వరలో అమల్లోకి కొత్త రూల్‌!
Embed widget