Kumbha Rasi 2025 Telugu: కుంభ రాశివారికి 2025 లో ఆదాయం పెరుగుతుంది కానీ అనుకోని కష్టాలు తప్పవ్.. ఈ నెలలు మీకు కలిసొస్తాయ్!
Aquarius Yearly Horoscope 2025 in Telugu: గడిచిన ఏడాది కన్నా కుంభ రాశివారికి నూతన సంవత్సరం 2025 లో మెరుగైన ఫలితాలుంటాయి. కొత్త ఏడాదిలో మీ రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి...
కుంభ రాశి (Aquarius Yearly Horoscope 2025)
2025లో కుంభ రాశివారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఏడాది ఆరంభంలో ఆదాయంతో పాటూ ఖర్చు పెరుగుతుంది. మే నెలలో బృహస్పతి రాశిమారిన తర్వాత ఖర్చులు తగ్గుతాయి. ఈ ఏడాది పొదుపు సంబంధిత పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. వ్యాపార పర్యటనల నుంచి ప్రయోజనం పొందుతారు. కుటుంబ అవసరాలపై చాలా శ్రద్ధ చూపుతారు.
కుంభ రాశివారి ఆరోగ్యం
2025లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి మూడు నెలలు ఆరోగ్యానికి సంబంధించి సాధారణంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి సమస్యలు జూలై నెలలో అధికం కావచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. జూన్ 2025 తర్వాత రెండో స్థానంలో శని సంచారం, రాహువు సంచారం మైగ్రేన్ రోగులను ఇబ్బంది పెడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్య అయినా తేలిగ్గా తీసుకోవద్దు. సెప్టెంబరు నుంచి డిసెంబర్ 2025 మధ్య డిప్రెషన్ కి గురవుతారు..ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి.
Also Read: 2025లో మకర రాశివారికి ఏలినాటి శని నుంచి విముక్తి.. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉంటుంది కానీ !
వ్యక్తిగత జీవితం
2025లో కుంభ రాశివారి కుటుంబంలో శుభ సంఘటనలు జరగవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. ఏప్రిల్ 2025 తర్వాత, వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉంటాయి. సంవత్సరం మధ్యలో శని తిరోగమనం కారణంగా కుటుంబంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంవత్సరం చివరిలో, ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తవచ్చు
ప్రేమ జీవితం
కుంభ రాశివారికి ఈ ఏడాది వైవాహిక జీవితంపై చాలా శ్రద్ధ అవసరం. రాహువు సంచారం వల్ల ఒడిదొడుకుల పరిస్థితి ఏర్పడుతుంది. మే 2025లో బృహస్పతి రాశిలోకి వెళ్లడం వల్ల అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. ఈ రాశి స్త్రీలు మానసిక క్షోభకు గురవుతారు.
విద్య - ఉద్యోగం
2025లో మీ కెరీర్‌కు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఏడాదిలో మే తర్వాత చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థులకు ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. మే 2025లో మిథునరాశిలో బృహస్పతి సంచారం తర్వాత మీకు అన్నీ శుభాలే. ఉన్నత విద్య, పరిశోధనలకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు.
Also Read: 2025లో ధనుస్సు రాశి వారికి అష్టమ శనితో చికాకులు..బృహస్పతి సంచారంతో ఉపశమనం!
జనవరి 2025 - ఈ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు కలిసొస్తాయి
ఫిబ్రవరి 2025 - ఈ నెలలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అన్నింటా అపజయం, ఏం మాట్లాడినా విరోధమే అన్నట్టుంటుంది పరిస్థితి. ఆదాయం బాగానే ఉంటుంది
మార్చి 2025 - ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారంలో శుభఫలితాలు..
ఏప్రిల్ 2025 - ఈ నెలలో శని మీ రాశి నుంచి మీనంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వస్తుంది. గత కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మే 2025 - ఈ నెలలో ఉద్యోగం, వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థికంగా అడుగుముందుకు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
జూన్ 2025 - జూన్ లో మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. గుడ్ న్యూస్ వింటారు. కెరీర్లో అడుగు ముందుకుపడుతుంది.
జూలై 2025 - ఈ నెలలో మీకు అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ ఆలస్యం అయినా పూర్తవుతాయి. డబ్బు పొదుపుచేస్తారు. ప్రయాణాల్లో లాభాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది.
Also Read: కొత్త ఏడాది ఆరంభంలో శని..ఆ తర్వాత బృహస్పతి సంచారంతో మీ జీవితంలో భారీ మార్పులు!
ఆగస్టు 2025 - ఆగష్టులో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మీ మాటతీరువల్ల ఇతరులు ఇబ్బందిపడతారు.
సెప్టెంబర్ 2025 - ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులుంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భయాందోళనలు వెంటాడుతాయి.
అక్టోబర్ 2025 - గడిచిన నెల కన్నా ఈ నెలలో పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులున్నప్పటికీ దైవసంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నవంబర్ 2025 - ఈ నెలలో కుటుంబం, కార్యాలయం, వ్యాపారంలో చికాకులుంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. దుబారా ఖర్చులుంటాయి
డిసెంబర్ 2025 - ఇయర్ కుంభ రాశివారికి కొంత చికాకుగా ఉంటుంది కానీ నూతన పరిచయాల వల్ల సంతోషంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి కానీ పూర్తవుతాయి.
Also Read: అదృష్టం - దురదృష్టం.. 2025లో తులా రాశి వారు ఏవైపు తూగుతున్నారు!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.