Sagittarius Yearly Horoscope 2025 in Telugu: 2025లో ధనుస్సు రాశి వారికి అష్టమ శనితో చికాకులు..బృహస్పతి సంచారంతో ఉపశమనం!
Dhanu Rashifal 2025 Yearly Horoscope 2025: ధనస్సు రాశివారికి ఏడాది ఆరంభంలో అధ్భుతంగా ఉంటుంది. నూతన సంవత్సంలో ధనస్సు రాశి పూర్తి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..
Dhanusu Rasi 2025 Telugu: ధనస్సు రాశివారికి 2025 ఆరంభం అద్భుతంగా ఉంటుంది కానీ మార్చి ఎండిగ్ నుంచి అర్దాష్టమ శని ప్రభావంతో సంవత్సరాంతం వరకూ చికాకులు తప్పవు...కానీ...బృహస్పతి సంచారం బావుండడంతో ముఖ్యమైన పనులన్నీ అడ్డంకులు అధిగమించి పూర్తిచేస్తారు.
ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కానీ అందుకు తగిన ఫలితం పొందుతారు.
విద్యార్థులు ఎంత కష్టపడినా ఫలితాలు మధ్యస్థంగానే ఉంటాయి
వ్యాపారులు ఎక్కువ కష్టపడితే సాధారణ ఫలితాలు అందుకుంటారు
వ్యక్తిగత జీవితంలో చికాకులు తప్పవు..కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి
రాజకీయ నాయకులకు ఒత్తిడి తప్పదు
Also Read: కొత్త ఏడాది ఆరంభంలో శని..ఆ తర్వాత బృహస్పతి సంచారంతో మీ జీవితంలో భారీ మార్పులు!
జనవరి 2025
ఈ నెలలో ఉత్సాహంగా ఉంటారు. నూతన వాహన, వస్తు, వస్త్రయోగం ఉంది. దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. నూతన పరిచయాలు కలిసొస్తాయి. శత్రువులు మిత్రులవుతారు.
ఫిబ్రవరి 2025
ఈ నెలలో చేపట్టిన కార్యాలు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసొస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి.అనుకోని ఖర్చులుంటాయి.
మార్చి 2025
ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉండొచ్చు. నూతన పరిచయాలు కలిసొస్తాయి.
ఏప్రిల్ 2025
ఈ నెల నుంచి మీకు అష్టమ శని ప్రారంభమవుతుంది. ఫలితంగా ఇక్కట్లు మొదలవుతాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్యం, లేనిపోని సమస్యలు, చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు నిరాశే ఎదురవుతుంది. అయితే నూతన వాహనం కొనుగోలు, స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి.
Also Read: అదృష్టం - దురదృష్టం.. 2025లో తులా రాశి వారు ఏవైపు తూగుతున్నారు!
మే 2025
మే నెల ధనస్సు రాశివారికి బృహస్పతి సంచారంతో కలిసొస్తుంది. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ గౌరవం పెరుగుతుంది.
జూన్ 2025
ఈ నెలలో వృత్తి, ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మూడింటిలోనూ చికాకులుంటాయి. అనుకోని వివాదాలు, చేపట్టిన పనుల్లో చిక్కులు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో అడుగు వేస్తే విజయం సాధిస్తారు.
జూలై 2025
ఈ నెలలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
ఆగస్టు 2025
ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. చికాకులు వస్తాయి తొలగిపోతుంటాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అంతకుమించి ఖర్చులుంటాయి.
శత్రువులు స్నేహితులు అవుతారు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.
సెప్టెంబర్ 2025
సెప్టెంబర్ లో ధనస్సు రాశివారు కుటుంబంలో వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్యంతో బాధపడతారు. ఏ పనీ చేయాలని అనిపించదు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!
అక్టోబర్ 2025
ఈ నెల మీకు కలిసొస్తుంది. చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసొస్తాయి. నమ్మినవారి చేతిలో మోసపోతారు..
నవంబర్ 2025
గడిచిన రెండు మూడు నెలల కన్నా నవంబర్ కొంత బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు..దాన ధర్మాలు చేస్తారు. వివాద సూచనలున్నాయి మాట జాగ్రత్త. శుభకార్యాలు నిర్వహణకు ప్లాన్ చేస్తారు.
డిసెంబర్ 2025
ఇయర్ ఎండ్ మీకు అంతగా కలసిరాదు. ఈ నెలలో చేసే వృత్తి వ్యాపారాల్లో నష్టాలుంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి. విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: కన్యారాశి వారికి కొత్త సంవత్సరం 2025 ఎలా ఉంటుంది.. ఏ రంగాల్లో సక్సెస్ అవుతారో తెలుసా!
Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.