అన్వేషించండి

Astrology 2024 New Year: 2024లో ఈ రాశులవారు జాగ్రత్త, శనిగ్రహంతో ఇబ్బందులు తప్పవు

Yearly Horoscope 2024 : జాతకంలో ఎన్ని గ్రహాలు బలమైన స్థానంలో ఉన్నప్పటికీ శని సంచారం సరిగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు... 2024 లో శని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే రాశులివే...

Shani Gochar 2024:  ప్రతి నెలా రాశులు మారే గ్రహాలు..నూతన ఏడాదిలో ఓ రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తున్నాయి. ఫలితంగా కొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది .  అయితే ఈ రాశుల వారు కొత్త సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి. శని కారణంగా కొన్ని ఇబ్బందులుంటాయి. ఏ పని చేపట్టినా కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. వృత్తి, ఉద్యోగం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 5 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. 

మేష రాశి (Aries Yearly Horoscope 2024)

2024వ సంవత్సరం మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్యంగా శని సంచారం వల్ల ఇబ్బందులు తప్పవు. కెరీర్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది...లేదంటే నష్టపోతారు. 

Also Read: ఈ రాశివారికి 2024లో ఈ 4 నెలలు పరీక్షా కాలమే!

మిధున రాశి (Gemini Yearly Horoscope 2024)

శని సంచారం వల్ల మిథునరాశివారికి కొత్త ఏడాదిలో ఆర్థిక సమస్యలు తప్పవు. బడ్జెట్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఏడాది ఆరంభంలో మీ జీవిత భాగస్వామితో బంధం క్షీణించవచ్చు. ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. కెరీర్ కి సంబంధించిన నిర్ణయాలు మాత్రం ఆలోచించి తీసుకోవం మంచిది. 

సింహ రాశి (Leo Yearly Horoscope 2024)

2024 సంవత్సరంలో  సింహ రాశి వారికి  చేపట్టిన పనుల్లో అడ్డంకులు తప్పవు. ఈ సంవత్సరం అంతా రాహువు మహాదశను ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపారం, వ్యక్తిగత జీవితం రెండింటిలో హెచ్చు తగ్గులు ఉంటాయి.

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

కన్యా రాశి (Virgo Yearly Horoscope 2024)

2024 సంవత్సరంలో, కన్యా రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి శని స్థానం భారంగా ఉండబోతోంది. మీరు అనేక విషయాలలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కెరీర్‌లో విజయం కోసం మీరు చాలా కాలం వేచి ఉండవలసి ఉంటుంది. సోదర సోదరీమణులతో సంబంధాలు కూడా క్షీణించవచ్చు.

మీన రాశి (Pisces Yearly Horoscope 2024)

మీన రాశి వారికి 2024 సంవత్సరం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా ఒడిదొడుకులు తప్పువు. వైవాహిక బంధంలో కొంత టెన్షన్ ఉంటుంది. ఈ రాశివారికి ఈ ఏడాది అదృష్టం కలసి రాదు..కేవలం కష్టపడితేనే విజయం సాధిస్తారు.

Also Read: కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు డిసెంబరు 18న ఇలా చేయండి!

అయితే శనిదోషం ఉన్నప్పటికీ శుక్రుడు, బృహస్పతి సంచారం బావుంటే...శని ప్రభావం తీవ్రంగా ఉండదు. నిత్యం నవగ్రహశ్లోకం చదువుకోవడం, శనివారం శనికి తైలాభిషేకం చేయడం, ఆంజనేయుడు -పరమేశ్వరుడిని పూజించడం ద్వారా శని బాధల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు పండితులు. 

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget