Astrology 2024 New Year: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!
పాత ఏడాదికి గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాదికి స్వాగతం పలుకేందుకు సిద్ధంగా ఉన్నారంతా. అయితే నూతన సంవత్సరం 2024 లో ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి..
Astrology 2024 New Year : ప్రతి నెలా రాశులు మారే గ్రహాలు..నూతన ఏడాదిలో ఓ రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తున్నాయి. ఫలితంగా కొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అయితే ఈ 6 రాశులవారి పరిస్థితిలో ఊహించనంత మంచి మార్పు రాబోతోంది. పాత సంవత్సరంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు తీరిపోయి కొత్త ఏడాదిలో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అదృష్టం కూడా కలిసొస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం
మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
2024 మేష రాశివారికి బాగా కలిసొస్తుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. ఉద్యోగులు వారికి నచ్చిన ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. కెరీర్లో మంచి వృద్ధి ఉంటుంది. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం బావుంటుంది. 2023 లో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు కొత్త ఏడాదిలో ఉండవు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు.
Also Read: ఈ రోజు ఈ రాశివారి ప్రవర్తనలో మార్పులొస్తాయి, డిసెంబరు 13 రాశిఫలాలు
మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎంత కష్టం అయిన పనిని అయినా అనుకున్న టైమ్ లో పూర్తిచేసేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితంలో వెంటాడుతున్న సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో బంధం బలోపేతమవుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే నూతన సంవత్సరంలో మారేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది.
సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
సింహ రాశివారు నూతన సంవత్సంలో ఊహించని విజయాలను చూస్తారు.ఈ రాశి ఉద్యోగులు కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీలో ఉండే లీడర్ షిప్ క్వాలిటీస్ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
కన్యా రాశి (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
కన్యా రాశివారి ఆర్థిక పరిస్థితి కొత్త ఏడాదిలో మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన గృహం, వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబ జీవితం బావుంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పనికి తగిన గుర్తింపు పొందుతారు..ప్రమోషన్ కి ఛాన్సుంది. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు.
Also Read: ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకంటే!
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ధనస్సు రాశివారు 2023 లో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలకు 2024 లో చెక్ పడుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ఉషోదయం మీ జీవితంలో రాబోతోంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగంలో స్థిరపడతారు. గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు పాటించడం ద్వారా మీరు సక్సెస్ దిశగా అడుగేస్తారు.
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
2024 లో కుంభ రాశి వారి జీవితం వెలిగిపోతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి గుర్తింపు పొందుతారు. వేతనం పెరుగుతుంది. ఈ ఏడాది మీరు ముందుగా ప్రణాళికలు వేసుకుని అడుగేస్తే ప్రతి పనీ సంపూర్ణం అవుతుంది. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది...మంచి ఫలితాలు సాధిస్తారు
Also Read: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.