అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Subrahmanya Shasthi 2023: కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు డిసెంబరు 18న ఇలా చేయండి!

Subrahmanya Shasthi 2022: డిసెంబరు 18 సుబ్రమణ్య షష్టి. నాగ పంచమి, నాగుల చవితి రోజు ఎవరికైనా పుట్టలో పాలుపోయడం కుదరకపోతే ఈ రోజు ఆ మొక్కులు చెల్లించుకుంటారు...ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే..

Significance of Subrahmanya Sashti : వివాహానికి అడ్డంకులు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, జాతకంలో కుజదోషం వల్ల వివాహం కానివారు, కాలసర్ప దోషం వెంటాడుతున్న వారు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు. 2023లో సుబ్రహ్మణ్య షష్టి డిసెంబరు 18 న వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటంటే...

శివుని రెండో కుమారుడైన కుమారస్వామే సుబ్రమణ్యస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రమణ్య స్వామి షష్టి జరుపుకుంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవర షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు  స్కంద షష్టి అని అంటారు. 

Also Read: ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకంటే!

మాతృగర్భం నుంచి పుట్టలేదు
కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు. శివుడు ఓసారి ధ్యానంలో ఉండగా మన్మథుడు ఆటంకం కలిగించాడు. తీవ్రమైన ఆగ్రహందతో మూడోకన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు పరమేశ్వరుడు. అదే సమయంలో శంకరుడి నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజం గంగానదిలో విడచి పెడతాడు అగ్ని. ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగులు కృత్తికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది. రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు. ఆ పొదల నుంచి ఆరుముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాశం తీసుకెళ్లారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని,  ఆరుముఖాలు కలవాడైనందున షణ్ముఖుడని, కార్తీకేయుడని...గౌరీశంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు.. దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకారుసుర సంహారం చేయిస్తారు. 

Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

ఆరు ముఖాలు ఇవే 

  • మొదటిది- మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం
  • రెండోది - పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం
  • మూడోది-  శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం
  • నాలుగోది-  శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం
  • ఐదోది - శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం
  • ఆరోది-  లౌకిక సంపదల్ని అందించే ముఖం

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

గ్రహదోషాలు తొలగిపోతాయి
వల్లీదేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి
సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించినా, అష్టకం చదువుకున్నా కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది
నాగుల చవితి, నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయలేకపోయినవారు...సుబ్రహ్మణ్య షష్టి రోజు పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి, బియ్యంపిండితో చేసిన చలిమిడి నైవేద్యం సమర్పిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి
మంచి సంతానం కలగాలన్నా, ఆర్థిక సమస్యలు తీరాలన్నా, కోర్టు లావాదేవీల్లో విజయం సాధించాలన్నా, విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలంటే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనే మంచి పరిష్కారం

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యంయే పఠంతి ద్విజోత్తమాః 
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః 
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ 
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naveen Yadav is set to become Minister: కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Bihar Election Results 2025: జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naveen Yadav is set to become Minister: కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Bihar Election Results 2025: జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
Bihar Election Result 2025: బిహార్ ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన ఈ 5 పాఠాలు ఇవే
బిహార్ ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన ఈ 5 పాఠాలు ఇవే
Bihar Election Result 2025 LIVE: బిహార్‌లో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఏ,
బిహార్‌లో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఏ,
Jubilee Hills By Election Results 2025:  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
Dude OTT: 'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
Embed widget