అన్వేషించండి

Bihar Election Result 2025: బిహార్ ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన ఈ 5 పాఠాలు ఇవే

Bihar Election Result | ఎన్నికల్లో గెలవాలంటే మంచి పనితీరు, నమ్మకం, సానుకూల రాజకీయాలు, సామాజిక సమీకరణలు అవసరం అని బిహార్ ప్రజలు నిరూపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలకు ఓట్లు రాలవని చూపించారు.

Bihar Election Result 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. సీట్ల సంఖ్య ఇప్పుడే స్పష్టం కాకున్నా, భారీ మెజారిటీతోనే జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేజిక్కించుకుంది. అయితే మహాకూటమికి ఈ ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పించాయి. భవిష్యత్తులో వీటిని విస్మరిస్తే ఏ పార్టీకైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఇప్పుడు బిహార్‌లో మహాకూటమికి ఎదురైన పరిస్థితే వారికి రానుంది.  

1. అమలు చేయగలిగే వాగ్దానాలు చేయాలి.. 

ఓటర్లు ఇకపై పెద్ద, ఆకర్షణీయమైన నినాదాలకు ఓటు వేయరని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. వారికి వాస్తవికమైన, అమలు చేయగలిగే వాగ్దానాలు కావాలి. నేతల నుంచి విశ్వసనీయత కోరుకుంటున్నారు. మహాకూటమి నాయకుడు తేజస్వి యాదవ్ 'ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం', 'మహిళలకు సంవత్సరానికి 30 వేల రూపాయలు' ఇస్తానని చేసిన వాగ్దానం అమలుకాదని రాష్ట్ర ఓటర్లు గుర్తించారు. ఈ వాగ్దానాలు అమలు సాధ్యం కానివి. ఈ వాగ్దానాలకు అయ్యే ఖర్చు బిహార్ బడ్జెట్‌తో సమానమని ప్రజలు గుర్తించారు.  

2. సంస్థలపై దాడులు కాదు, ప్రజల సమస్యలపై ఫోకస్

రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైన, ఎన్నికలు నిర్వహించే సంస్థ అయిన ఈసీపై పదేపదే ప్రశ్నలు సంధించకూడదు. ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు చేయడం ప్రజలలో నమ్మకాన్ని పెంచడానికి బదులుగా ప్రతికూలతను కలిగిస్తుంది. మహాకూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలపై దృష్టిపెట్టడానికి బదులుగా ఈసీపై ఆరోపణలు చేశారు. కనుక విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు వంటి ప్రజా ప్రయోజన సమస్యలపై దృష్టి సారించే పార్టీలకు ప్రాధాన్యత ఇస్తామని బిహార్ ప్రజలు స్పష్టం చేశారు.

3. ఓటింగ్ కంటే ముందు ఎన్నికల బహుమతులు పంచడం వల్ల ప్రయోజనం!

ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకునే పెద్ద ప్రకటనలు లేదా ఎన్నికల బహుమతులు (ఉచిత సౌకర్యాలు) ప్రకటించడం ఓట్లు రాబట్టేందుకు దోహదం చేస్తాయని నిరూపించాయి. ఈ ప్రకటనలు తరచుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తాయి.  దాంతో ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఇది దీర్ఘకాలిక అభివృద్ధికి సరైనది కాకపోయినా, తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ప్రజలు భావించడంతో ప్రయోజనం పొందవచ్చు. 

4. మహిళల సమస్యలపై దృష్టి

బిహార్ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఎన్నికలలో ఒక ముఖ్యమైన సామాజిక మార్పు కనిపిస్తోంది. మహిళలు ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇది ఒక నిర్ణయాత్మకమైన సైలెంట్ ఓటింగ్ గా మారింది.  ఈ ఎన్నికల్లో దాదాపు 71 శాతం మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో రాజకీయ పార్టీలు మహిళల భద్రత, సాధికారత, మహిళల సమస్యలపై ఫోకస్ చేయాలి. మహిళల ప్రయోజనాలను కాపాడటంలో ఎవరు ముందుంటారో, ఆ పార్టీ విజయం సాధిస్తుంది. వారికి గొప్ప విజయం లభిస్తుంది.

5. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం కావాలి

బిహార్ ఓటర్లు రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే రాజకీయ పార్టీ లేదా కూటమి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉంటే వివాదాస్పద పరిస్థితులు ఏర్పడతాయి. రాష్ట్ర అభివృద్ధి పనులకు అవాంఛిత అడ్డంకులు ఏర్పడతాయని ప్రజలు భావించారు. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ పాలసీకి మొగ్గు చూపారు. అప్పుడే రాష్ట్రానికి నిధులు వచ్చి, స్థిరంగా పాలన సాగుతుందని చూపించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Malavika Mohanan: ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
Advertisement

వీడియోలు

మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Malavika Mohanan: ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
Harish Rao Challenges Revanth Reddy: రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
Anasuya Bharadwaj Farmhouse: ఫామ్‌ హౌస్‌లో ఆవు దూడలతో అనసూయ ఆటలు... వింటర్ వీకెండ్ డైరీస్
ఫామ్‌ హౌస్‌లో ఆవు దూడలతో అనసూయ ఆటలు... వింటర్ వీకెండ్ డైరీస్
Addanki Dayakar Interview: మంత్రి పదవిపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు! రేవంత్ రెడ్డికి చెడ్డపేరు వస్తుందా?
నాకు క్యాబినెట్‌లో చోటివ్వకపోతే రేవంత్ రెడ్డికే నష్టం!: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
Embed widget