Bihar Election Result 2025 LIVE: బిహార్‌లో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఏ,
Bihar Election 2025 Result LIVE Updates:బిహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 243 మంది రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో, పరిశీలకుల సమక్షంలో అభ్యర్థులు మరియు వారి ఏజెంట్ల సమక్షంలో జరగనుంది.
LIVE

Background
Bihar Election 2025 Result: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఇప్పుడు కీలకమైన చివరి దశకు చేరుకున్నాయి. ఓట్ల లెక్కింపు- ఫలితాల ప్రకటన శుక్రవారం జరగనుంది. నవంబర్ 6 -నవంబర్ 11 తేదీలలో జరిగిన రెండు దశల పోలింగ్‌లో ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తంచేశారు. బిజెపి-జెడి (యు) నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలుపుకుంటుందా లేదా ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్ మద్దతుగల మహాఘట్బంధన్ తొమ్మిది సార్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను గద్దె దించగలదా అనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం కౌంటింగ్ జరుగుతుంది, ప్రారంభ ట్రెండ్‌లు త్వరగానే వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ తదుపరి రోజుల్లో నియోజకవర్గాల వారీగా తుది డేటాను విడుదల చేయనుంది.
బిహార్ పోల్ కౌంటింగ్ కోసం ఈసీ సన్నాహాలు
2,600 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించడానికి 7.4 కోట్ల మంది ఓటర్లు అర్హులైన 38 జిల్లాల్లోని 46 కేంద్రాలలో కౌంటింగ్ జరగనుంది. నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో జరిగిన పోలింగ్‌లో దాదాపు 67% పోలింగ్ నమోదైంది, ఇది 1951లో స్వతంత్ర భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల తర్వాత బిహార్‌లో అత్యధికం అని ఈసీ తెలిపింది.
ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల కారణంగా పాట్నాలోని అన్ని పాఠశాలలు శుక్రవారం మూసివేస్తున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. "243 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 243 మంది రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో, వారితో పాటు నియమితులైన 243 మంది పరిశీలకుల సమక్షంలో అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు జరుగుతుంది" అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
18,000 మందికి పైగా ఏజెంట్లు పర్యవేక్షిస్తారు
"మొత్తం 4,372 లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేసాము, ప్రతి టేబుళ్లలో ఒక సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అభ్యర్థులు నియమించిన 18,000 మందికిపైగా లెక్కింపు ఏజెంట్లు కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు."
శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం, ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు, ఈవీఎంలు ఉదయం 8:30 గంటలకు ప్రారంభమవుతాయని ప్రకటనలో పేర్కొంది.
CRPF 106 కంపెనీల విధి
"శాంతియుతంగా లెక్కింపును నిర్ధారించడానికి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించడానికి రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర సాయుధ పోలీసు దళం (CAPF) బిహార్ పోలీసుల తగినంత సిబ్బందిని మోహరించారు" అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన 106 కంపెనీలను కూడా భద్రతా విధుల కోసం మోహరించామని ఆయన అన్నారు.
స్ట్రాంగ్ రూమ్‌లో VVPAT సీలు చేశారు
ఓటింగ్‌లో ఉపయోగించే EVMలు -VVPATలను సీలు చేసి డబుల్ లాకింగ్ సిస్టమ్‌లతో కూడిన స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రంగా ఉంచినట్లు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. "లెక్కింపు కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను నిర్ధారించాము. లోపలి భద్రతా వలయాన్ని CAPFకి అప్పగించారు, బయటి చుట్టుకొలతను రాష్ట్ర పోలీసులు కాపలాగా ఉంచారు. అదనంగా, 24x7 CCTV నిఘా, ఇతర భద్రతా చర్యలు కూడా అమలు చేశారు" అని ఆయన అన్నారు.
Bihar Election Results 2025:బిహార్‌లో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఏ
Bihar Election Results 2025:బిహార్‌లో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఏ, అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Bihar Election Result 2025 LIVE: రఘోపూర్ అసెంబ్లీ స్థానంలో తేజస్వి యాదవ్ మరోసారి వెనుకంజ
Bihar Election Result 2025 LIVE: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ మరోసారి రాఘోపూర్ అసెంబ్లీ స్థానంలో వెనుకబడ్డారు. ఎన్నికల కమిషన్ ఏడో రౌండ్ ట్రెండ్స్ ప్రకారం, ఆయన 343 ఓట్ల వెనుకబడి ఉన్నారు. కౌంటింగ్ కొనసాగుతున్నందున బిజెపికి చెందిన సతీష్ కుమార్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.





















