Naveen Yadav is set to become Minister: కాబోయే మంత్రి నవీన్ యాదవ్.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో గెలవడంతో నవీన్ తెలంగాణ కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Naveen Yadav to be in Cabinet: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిరిగిన కీలకమైన ఎన్నికలు జూబిలీహిల్స్ బై ఎలక్షన్. రేవంత్ ప్రభుత్వానికి ఇజ్జత్ కా సవాల్‌గా మారిన ఈ ఎన్నికలో గెలవడం తప్పనిసరి అయింది. అలాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొత్తం తెలంగాణ కేబినెట్ అంతా ఓ వైపు, అటువైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ఆ పార్టీ అధినాయకగణం మొత్తం మరోవైపు నిలిచి హోరాహోరీగా పోరాడారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఎన్నికలో గెలిచాడు కాబట్టి.. నవీన్ యాదవ్‌కు దానికి తగ్గ రివార్డ్ ఉంటుందా అన్న చర్చ నడుస్తోంది. పైగా పరిస్థితులు కూడా అందుకు తగ్గట్లుగా ఉన్నాయి.
మంత్రివర్గ విస్తరణ- నవీన్‌కు చాన్స్
జూబిలీహిల్స్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం తీసుకుంది. బీసీలకు ప్రాముఖ్యత కల్పించే ఉద్దేశ్యంతో కులగణన చేసింది. దీనిని దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేసింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కట్టబెడుతూ చట్ట సవరణ చేసింది. కేంద్రం చట్ట సవరణకు ఒప్పుకోకపోవడం.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు కోర్టు నుంచి ఆటంకాలు ఎదురుకావడంతో బీసీ రిజర్వేషన్ అమలు చేయలేకపోయారు. కాబట్టి బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. జూబిలీహిల్స్ ఎన్నికల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అందులో బీసీలకు మరిన్ని స్థానాలు కల్పించాలని… అవసరమైతే మరో ఉపముఖ్యమంత్రి పదవి కల్పించి బీసీనేతకు ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. కాబట్టి వచ్చే విస్తరణలో బీసీలకు చాన్స్ ఎక్కువుగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ప్రస్తత కేబినెట్‌లో ఉన్న బీసీ మంత్రి కొండా సురేఖతో వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా ఆవిడను మార్చితే.. ఆ స్థానం కూడా బీసీలకు వస్తుంది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు ముగ్గురు బీసీలీ నేతలకు చాన్స్ ఉంటుంది. ఆ అవకాశం నవీన్‌కు దక్కే అవకాశం ఉంది.
కలిసొచ్చే సామాజిక సమీకరణం
నవీన్‌కు చాన్స్ రావడానికి బీసీలకు ఉన్న అవకాశాలు మాత్రమే కాదు. ఇతర సమీకరణాలు కూడా కలిసి రానున్నాయి. జూబిలీహిల్స్ హైదరాబాద్‌కు గుండెకాయ లాంటిది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం కచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక హైదరాబాద్‌లో నవీన్ యాదవ్‌కు చెందిన యాదన సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో వారి ఇంపాక్ట్ ఉంది. ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ.. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వాల్లో ఆ సామాజిక వర్గం నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆ వర్గానికి అవకాశం రాలేదు. ప్రస్తుత కేబినెట్లోనూ ఈ సామాజిక వర్గం వాళ్లు లేరు. కాబట్టి నవీన్‌కు చాన్స్‌లు ఎక్కువుగా ఉన్నట్లే
కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రమంతా గెలిచిన గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం బోల్తా పడింది. ఇక్కడ అసలు ఖాతా తెరవలేదు. ఆంధ్రతో పాటు.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు ఎక్కువుగా ఉండే ఇక్కడ ఓల్డ్ సిటీలోని 7-8 నియోజకవర్గాలు మినహాయిస్తే.. మిగిలిన చోట్ల బీఆర్‌ఎస్ డామినేట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన నేత కావాలి. సామాజిక వర్గ దన్ను, అంగబలం, అర్థబలం కూడా ఉన్న నవీన్ యాదవ్‌కు మించిన ప్రత్యామ్నాయం ఏముంటుుంది..? పైగా నవీన్ కుటుంబం మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు బంధువులే. ఆయన తండ్రిపై ఉన్న కేసులు, బ్యాక్‌గ్రౌండ్‌పై చర్చ ఉన్నప్పటికీ.. నవీన్ విద్యావంతుడు.
అన్నింటికి మించి మొన్న హైదరాబాద్ నుంచి అజారుద్దీన్‌కు పదవి ఇచ్చే వరకూ అసలు మంత్రివర్గంలో మహానగరానికి ప్రాతినిధ్యమే లేదు. పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్‌చార్జ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఇప్పుడు నగరంలో నవీన్‌కు చాన్స్ ఇచ్చి.. కాంగ్రెస్ పార్టీని చార్జ్ చేయాలని రేవంత్ భావిస్తారు. పైగా ఇతను సీనియర్ కాకపోవడం.. రేవంత్‌కు సన్నిహితంగా కూడా ఉంటడంతో సీఎంకు కూడా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇన్ని సమీకరణాలు కలిసొస్తున్నయి కాబట్టి నవీన్ యాదవ్ మంత్రి అవ్వడానికే ఛాన్స్‌లు ఎక్కువ.





















