Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!
Margashira Masam 2023: డిసెంబరు రెండోవారంలో కార్తీకమాసం ముగిసి మార్గశిరమాసం ప్రారంభమవుతోంది. డిసెంబరు 13 నుంచి ప్రారంభమయ్యే మార్గశిరమాసాన్ని తెలుగు నెలల్లో విలక్షణమైన నెల అంటారు..ఎందుకంటే...
![Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే! Margashira Masam 2023 Starting Ending Dates and list of festivals in December 2023 know in telugu Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/87b75ebad9fc674de82672ae677bfa221701496257893217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Margashira Masam 2023 Starting Ending Dates: మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు గీతబోధనలో భాగంగా మార్గశిర మాసం స్వయంగా తానే అన్నాడు. ఈ నెలలో చేసే ఏ పూజైనా,హోమమైన, అభిషేకమైనా తానే స్వయంగా స్వీకరిస్తానని తెలియజేశాడు.
మాసాలన్నింటిలో అగ్రగణ్యం మార్గశిరం
తెలుగు నెలల్లోని ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటంటే..ఈ నెలను మార్గ శీర్షం అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం..మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది అని అర్థం. డిసెంబరు 13 నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది. ఈనెల లక్ష్మీదేవికి, మహావిష్ణువుకు, సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది. మరో విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి 'భగవద్గీత' బోధించినది ఈ నెలలోనే . సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం మొదలవుతుంది.
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
మార్గశిర మాసంలో ప్రత్యేకరోజులివే
పంచమి రోజు నాగపూజ
మార్గశిర శుద్ద పంచమి రోజు నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజ ఇది
స్కంద షష్ఠి
మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏడాది సుబ్రహ్మమ్య షష్టి డిసెంబరు 18న వచ్చింది
Also Read: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!
భానుసప్తమి
మార్గశిర శుద్ద సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేస్తే అన్నీ శుభఫలితాలే
కాలభైరవాష్టమి
మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుందంటారు. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే మంచిదని చెబుతారు. డిసెంబరు 20న కాలభైరవాష్టమి వచ్చింది
Also Read: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!
ముక్కోటి ఏకాదశి
మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని.. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం.
గీతా జయంతి
వైకుంఠ ఏకాదశి రోజే గీతా జయంతి జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ణాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినం రోజు అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించింది ఇదే రోజు
"గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:"
గీత అనే రెండక్షరములు సర్వసంగపరిత్యాగానికి, ఆత్మసాక్షాత్కారానికి ప్రతీకలు. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది. అలాంటి పరమపావనమైన గీతన భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ రోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించినా మహాపుణ్యం వస్తుందని హిందువుల విశ్వాసం.
- మార్గశిర ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు
- మార్గశిర శుద్ద త్రయోదశి రోజు హనుమంతుడి భక్తులు ఆంజనేయుడి వ్రతం ఆచరిస్తారు
- మార్గశిర శుద్ద పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం
- కార్తిక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు చాచి ఉంటాడట. అందకే మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మ రాజుకి నమస్కరిస్తే సంపూర్ణ ఆయుష్షు లభిస్తుందంటారు
Also Read: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !
ఈ నెలలోనే ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కుటంబలో ఆనందం వెల్లివిరుస్తుందని, ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని పండితులు చెబుతారు
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)