డిసెంబరులో మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు డిసెంబరు నెలలో వ్యయంలో గ్రహసంచారం వల్ల మకరరాశి వారికి అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తగ్గుతుంది. వ్యాపార వ్యవహారాలు పెద్దగా కలసిరావు. వాహనరిపేర్లు, కొన్ని వస్తువులు పోగొట్టుకోవడం జరగొచ్చు. కుటుంబ వాతావారణం బావుంటుంది కానీ బంధుమిత్రులతో విరోధ సూచనలున్నాయి పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచడం మంచిది మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు కానీ మానసికంగా ఒత్తిడి మిమ్మల్ని చుట్టుముడుతుంది. మిత్రద్రోహులున్నారు జాగ్రత్తగా ఉండండి మకర రాశివారి అదృష్ట సంఖ్య 7 , కలిసొచ్చే రంగు నీలం. Images Credit: Pixabay