జన్మంలో గ్రహసంచారం - డిసెంబరు ఈ రాశివారికి కలసిరాదు 2023 డిసెంబరు నెల ధనస్సు రాశివారికి అంతగా కలసిరాదు. జన్మంలో గ్రహసంచారం వల్ల చేసే వృత్తి వ్యాపారాలు కలసిరావు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ప్రతి విషయానికి అధికంగా కోప్పడతారు. వాహనప్రమాదం ఉంది జాగ్రత్త. నూతన అవకాశాలు వస్తాయి కానీ ఆలోచించి అడుగేయాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల విషయంలో సున్నితంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది ధనస్సు రాశివారి అదృష్ట సంఖ్య 5, మీకు అనుకూలమైన రంగు నీలం. Images Credit: Pixabay