అన్వేషించండి

Vallabhaneni Vamsi Latest News: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు- బెయిల్ పిటిషన్‌పై పోలీసుల కౌంటర్- జడ్జి ముందు సత్యవర్ధన్ వాంగ్మూలం

Andhra Pradesh Latest News: ఎస్సీఎస్టీ వేధింపు కేసులో బెయిల్ కోసం వల్లభనేని వంశీ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సత్యవర్ధన తన వాంగ్మూలం నమోదు చేశాడు.

Andhra Pradesh Latest News: తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్థన్ అనే వ్యక్తిని బెదిరించినందుకు అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్‌ పిటిషన్‌తోపాటు తనకు జైల్లో సౌకర్యాలు కావాలని కూడా మరో పిటిషన్‌ వేశారు. దీని కోసం తన ఆరోగ్య పరిస్థితి వివరించే డాక్యుమెంట్స్‌ కూడా కోర్టుకు సబ్‌మిట్ చేశారు. 

విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ రెండు పిటిషన్‌లు వేశారు. సత్యవర్థన్‌ అన్న పెట్టిన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్ వేశారు. మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తనకు జైల్లో సౌకర్యాలు ఇవ్వాలని వేడుకున్నారు. ఈ పిటిషన్లకు వ్యతిరేకంగా పోలీసులు కౌంటర్ వేశారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించుకున్నారు. 

తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్‌ తనకు తానుగా కేసు వాపస్ తీసుకున్నట్టు వంశీ కోర్టుకు చెప్పారు. అతన్ని తాను బలవంతంగా తీసుకురాలేదని తనకు తానుగా తన తల్లితో కలిసి వచ్చారని కోర్టుకు తెలిపారు. తనను ఇరికించాలనే ప్రభుత్వం కుట్ర పన్ని తనపై కేసులు పెట్టిందని వెల్లడించారు. ఇందులో తన తప్పు ఏం లేదని వివరించారు. 

తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని జైల్లో సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు వల్లభనేని వంశీ. ఇంటి భోజనం అందించాలని వేడుకున్నారు. నడుం నొప్పి ఉన్నందున తనకు బెడ్ ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. పిటిషన్లతోపాటు తన ఆరోగ్య సమస్యలు వివరిస్తూ వైద్యులు ఇచ్చిన రిపోర్టులను కూడా కోర్టుకు సమర్పించారు వంశీ. 

వల్లభనేని వంశీ వేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అందుకే ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే కేసులో సాక్షులను తారుమారు చేసే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 

Also Read: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా

మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్థన్ విజయవాడ కోర్టుకు వచ్చారు. వంశీ అరెస్టు కేసులో ఏం జరిగింది అని తెలుసుకునేందుకు ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూల ఆధారంగానే వంశీ కేసు భవిష్యత్ ఆధారపడి ఉంది. దాని ఆధారంగా తదుపరి ప్రక్రియ ఉండబోతోంది. 

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ 71 వ నిందితుడిగా ఉన్నారు. ఈకేసులో కీలకమైన సత్యవర్థన అనే వ్యక్తిని బెదిరించారన్న ఆరోపణలతో ఇప్పుడు అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని బెదిరించి కేసును వాపస్ తీసుకునేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. సత్యవర్ధన్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకుపోలీసులు కేసు నమోదు చేసి వంశీని అరెస్టు చేశారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు వేధింపుల కేసు పెట్టారు. 
సత్యవర్థన్‌ను తీసుకురావడం తీసుకెళ్లడం అన్నీ విషయాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ ఫుటేజ్ కీలకంగా మారబోతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి సెల్‌ఫోన్‌ కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి అరెస్టు రోజు నుంచి ఈ సెల్‌ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన కాల్ రికార్డును కూడా పరిశీలిస్తున్నారు. అయితే సెల్‌ఫోన్‌లో కీలకమైన ఆధారాలు ఉంటాయని భావిస్తున్నారు. గురువారం నుంచి ఆయన సెల్‌ఫోన్ కోసం వెతుకుతున్నా దొరకడం లేదని తెలుస్తోంది. 

Also Read: మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Son Injured: పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు, అసలేం జరిగింది
Pawan Kalyan Son Injured: పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు, అసలేం జరిగింది
Rice Mills For Women: మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్, రైస్ మిల్లులు నిర్మించి ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
మహిళా సంఘాలకు రైస్ మిల్లులు నిర్మించి ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
Andhra Pradesh Aqua Industry Issue: ఆంధ్రప్రదేశ్‌ రొయ్యకు ట్రంప్ వైరస్‌- విరుగుడు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ రొయ్యకు ట్రంప్ వైరస్‌- విరుగుడు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు ప్రభుత్వం
Fake Videos Cases: కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ -  హైకోర్టులో పిటిషన్
కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ - హైకోర్టులో పిటిషన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilak Varma Batting vs RCB IPL 2025 | తనను అవమానించిన హార్దిక్ తో కలిసే దడదడలాడించిన తిలక్Hardik Pandya vs Krunal Pandya MI vs RCB | IPL 2025 లో మంచి మజా ఇచ్చిన అన్నదమ్ముల సవాల్MI vs RCB Match Highlights IPL 2025 | ముంబైపై 12పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ | ABP DesamTilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Son Injured: పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు, అసలేం జరిగింది
Pawan Kalyan Son Injured: పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు, అసలేం జరిగింది
Rice Mills For Women: మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్, రైస్ మిల్లులు నిర్మించి ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
మహిళా సంఘాలకు రైస్ మిల్లులు నిర్మించి ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
Andhra Pradesh Aqua Industry Issue: ఆంధ్రప్రదేశ్‌ రొయ్యకు ట్రంప్ వైరస్‌- విరుగుడు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ రొయ్యకు ట్రంప్ వైరస్‌- విరుగుడు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు ప్రభుత్వం
Fake Videos Cases: కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ -  హైకోర్టులో పిటిషన్
కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ - హైకోర్టులో పిటిషన్
Allu Arjun Birthday: ఫ్యామిలీతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఐకాన్ స్టార్... అల్లు అర్జున్ ఫ్యామిలీ పిక్ చూశారా?
ఫ్యామిలీతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఐకాన్ స్టార్... అల్లు అర్జున్ ఫ్యామిలీ పిక్ చూశారా?
NTR Vaidya Seva Scheme: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం
IPL 2025 MI VS RCB Result Update: ముంబైకి షాక్.. ఆఖర్లో తడబడి చేజేతులా ఓడిన ఎంఐ, తిలక్, హార్దిక్ పోరాటం వృథా.. ఆర్సీబీ స్టన్నింగ్ విక్టరీ
ముంబైకి షాక్.. ఆఖర్లో తడబడి చేజేతులా ఓడిన ఎంఐ, తిలక్, హార్దిక్ పోరాటం వృథా.. ఆర్సీబీ స్టన్నింగ్ విక్టరీ
Pawan Kalyan News: నా పర్యటన వల్ల విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారా? విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
నా పర్యటన వల్ల విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారా? విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Embed widget