అన్వేషించండి

Viral News : జ్వరానికి వైద్యం అగర్‌బత్తీలతో కాల్చడం - డిజిటల్ ప్రపంచంలోనూ పసిబిడ్డలపై ఘోరాలు - కర్ణాటకలో అమానుషం

Karnataka horror : కర్ణాటకలో కొప్పలో జిల్లాలో జ్వరానికి వైద్యం పిల్లలకు వాతలు పెట్టడం అని అనుకుంటున్నారు. ఈ వైద్యం కారణంగా ఓ పాప చనిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Karnataka News: పిల్లలకు అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి కానీ మూఢ నమ్మకాలతో సొంత వైద్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. సొంత వైద్యం వేరు.. మూఢ నమ్మకాలు వేరు.  కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జ్వరాలకు విరుగుడు అంటూ అగర్‌బత్తీలతో పిల్లలను కాల్చారు. దాదాపుగా పద్దెనిమిది మంది పిల్లలపై ఇలా  అఘాయిత్యానికి పాల్పడటంతో  ఒక పాప చనిపోయింది కూడా. ఈ వ్యవహారం  కర్ణాటకలో కలకలం రేపుతోంది. 

కొప్పల్ జిల్లాలోని ఓ గ్రామంలో సరైన వైద్య సౌకర్యాలు ఉండవు. ప్రజలకు సరిగ్గా అవగాహన కూడా లేదు. అక్కడ పిల్లలకు జ్వరం వస్తే ఏదో దుష్టశక్తి ఆవహిచిందని అనుకుంటారు. దాన్ని తరిమేయడానికి అగర్‌బత్తీలతో కాలిస్తే సరిపోతుదంని అనుకుంటారు ఇటీవల ఆ గ్రామంలో పిల్లలు వరుసగా అనారోగ్యం బారిన పడుతున్నారు. వారిలో పద్దెనిమిది మంది పిల్లల  తల్లిదండ్రులు  జ్వరాన్ని నయం చేస్తుందనే    నమ్మకంతో అగరుబత్తులతో కాల్చారు.ఈ వ్యవహారం ఓ పాప మరణించిన తర్వాతనే వెలుగులోకి వచ్చింది. 

కొప్పల్ జిల్లాలో విఠలాపూర్ గ్రామంలో ఏడు నెలల పాప చనిపోయింది. ఈ పాప ఎలా చనిపోయిందో వివరాలు బయటకు తెలిసిన తరవాత సంచలనంగా  మారింది. జ్వరం వస్తే అగర్‌బత్తీలతో  కాల్చాలన్న మూఢనమ్మకం కారణంగానే పాప చనిపోయినట్లుగా గుర్తించారు.  బూడిద దైవ ఆశీర్వాదాలను ఇస్తుందని..   కోలుకోవడానికి దారితీస్తుందని నమ్మి, శిశువు తల్లి తన బిడ్డ జ్వరానికి చికిత్స చేయడానికి మండే అగరుబత్తిని  ఉపయోగించినట్లుగా గుర్తించారు. ఫలితంగా  శిశువు మరణించిందని  గుర్తించారు.  

ఈ ఘటన తర్వాత అధికారులు  విఠలాపూర్ , పరిసర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటన చేశారు.  తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా తమ పిల్లలకు వాతలు పెట్టడానికి అగరబత్తీలను ఉపయోగించిన కనీసం 18 ఘటనలను కనుకొన్నారు. అగరబత్తీలతో చర్మాన్ని కాల్చడం వల్ల అనారోగ్యం తొలగిపోతుందని, దేవుళ్లను సంతోషపరుస్తుందని స్థానికులు నమ్ముతారు.

ప్రపంచం అంతా సైన్స్,  వైద్యంలో ముందుకెళ్తున్నప్పటికీ  ఇక్కడ కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఇటువంటి క్రూరమైన పద్ధతులపై ఆధారపడుతున్నాయని తెలుసుకుని  అధికారులు ఆశ్చర్యానికి లోబయ్యారు.  ఈ పద్ధతులను ప్రచారం చేసే ‘బాబాలు’ అని పిలిచే వారితో సహా బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు  వినిపిస్తున్నాయి. 

శిశువు మరణాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది.   ఆధునిక ఆరోగ్య సంరక్షణ ,  పిల్లల భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించడానికి అవగాహన డ్రైవ్‌లను ప్లాన్ చేస్తున్నారు.  చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, నిరంతర విద్య, సమాజ భాగస్వామ్యం ద్వారా అటువంటి మూఢనమ్మకాలను నిర్మూలించడానికి కూడా కృషి చేస్తామని ప్రభుత్వ అధిాకరులు ప్రకటించారు. దేశం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా ఇలాంటి వారు ఇంకా ఎక్కడో చోట ఉంటారని.. పిల్లల ప్రాణాలను బలి తీసుకుంటారని బయట పడుతూనే ఉన్నాయి. 

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వైద్యంపై మరింత స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఇంకా ఉందని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేస్తున్న వారు కూడా మూఢనమ్మకాలనే ఎక్కువగా నమ్ముతూండటం అధికారవర్గాలకూ సవాల్‌గా మారింది.           

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget