Rohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే
మ్యాచ్ ఫలితం అటూ ఇటుగా ఉన్నప్పుడు కెప్టెన్ అనే రచించే వ్యూహాలే జట్లకు సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి. నిన్న దానికి ఉదాహరణే రోహిత్ శర్మ. అతను కెప్టెన్ కాకున్నా పాండ్యా కెప్టెన్ అయినా కూడా రోహిత్ శర్మ అప్లై చేసిన ఓ స్ట్రాటజిక్ మూవ్ అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది. స్పిన్నర్ కర్ణ్ శర్మ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకునేందుకు తను బయటకు వెళ్లిపోయాడు రోహిత్ శర్మ. అప్పటి నుంచి డగౌట్ నుంచే మ్యాచ్ ను చూస్తూ సలహాలు సూచనలు అందిస్తూ యానిమేటెడ్ గానే గడిపాడు. వాటిలో ప్రధానమైంది 206 పరుగులఛేజింగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ 12 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఇలాంటి టైమ్ లో రోహిత్ శర్మ డగౌట్ నుంచి ఓ ఇన్ స్ట్రక్షన్ పాస్ చేశాడు అదేంటంటే సీమర్ కి కాదు కర్ణ్ శర్మ కి బౌలింగ్ ఇవ్వమని. ఎందుకంటే ఆ ఓవర్ స్టార్టింగ్ లోనే ముంబై కి పొడిగా ఉన్న బంతిని అందించాడు అంపైర్. సో ఆ మార్పు నుంచి ఫలితం రాబట్టేందుకు కర్ణ్ శర్మ తో బౌలింగ్ వేయించాలని సూచించాడు రోహిత్. అప్పటికే రెండు ఓవర్లు వేసి 24పరుగులు ఇచ్చిన కర్ణ్ శర్మ సెకండ్ స్పెల్ లో మాత్రం రెచ్చిపోయాడు. ప్రమాదకర ట్రిస్టన్ స్టబ్స్ ని ఆ ఓవర్ లో కర్ణ్ శర్మ అవుట్ చేయగా… మళ్లీ ఆ తర్వాత వేసే తన ఆఖరి ఓవర్ లో ఢిల్లీ సూపర్ స్టార్ కేఎల్ రాహుల్ ను అవుట్ చేశాడు. మరో వైపు శాంట్నర్ కరుణ్ నాయర్ ను, విప్రాజ్ నిగమ్ ను అవుట్ చేయంతో మ్యాచ్ ముంబై చేతుల్లోకి వచ్చేసింది. కానీ ఆఖర్లో కొట్టాల్సిన స్కోరు బాల్స్ కి సరిపడా ఉండటంతో ఢిల్లీ ఏమన్నా అద్భుతం చేస్తుందా అనుకుంటే వరుసగా మూడు బంతుల్లో ముగ్గురిని రనౌట్ చేసి ముంబై ఢిల్లీ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. తను కెప్టెన్ కాకపోయినా జట్టుకు మంచి జరిగే విషయాన్ని పంచుకోవటం ద్వారా రోహిత్ శర్మ చేసిన మేలు ముంబైకి ఈ సీజన్ లోరెండో విజయాన్ని అందించింది.





















