అన్వేషించండి

Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Modi: కంచ గచ్చిబౌలి భూ వివాదంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవుల్ని నరికేసిన వన్య ప్రాణాల్ని కాంగ్రెస్ సర్కార్ చంపుతోందన్నారు.

Prime Minister Modi:  అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ప్రకృతిని విధ్వంసం చేసి.. వన్యప్రాణులను చంపుతున్నారని ఆయన ఆరోపించారు. మేం పర్యావరణాన్ని కాపాడుతూంటే.. వారు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని విమర్శించారు.  

హర్యానాలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై మోదీ విమర్శలు              

అంబేద్కర్ జయంతి సందర్భంగా హర్యానాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు.  కాంగ్రెస్ , ఆ పార్టీ ప్రభుత్వలపై విమర్శలు గుప్పిస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రస్తావన తీసుకు వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి..అడవులను ధ్వంసం చేయడంలో బిజీగా ఉందన్నారు. అది  కాంగ్రెస్ నైజమన్నారు.                

దేశవ్యాప్తంగా వైరల్ అయిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం           

కంచ గచ్చిబౌలి భూములను తెలంగాణ ప్రభుత్వం అమ్మడానికి ఏర్పాట్లు చేసింది. అయితే ఆ భూములు చాలా కాలంగా నిరుపయోగంగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున చెట్లు పెరిగాయి. హెచ్‌సీయూని ఆనుకుని ఉండటంతో వన్య ప్రాణులు అక్కడ నివాసం ఉంటున్నాయని చెబుతున్నారు. ఇటీవల వంద ఎకరాల్లో చదును చేయడంతో  వన్య ప్రాణులు రోడ్లపైకి వచ్చి చనిపోతున్నాయని ప్రచారం జరిగింది. అక్కడి వీడియో జాతీయ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అందుకే ప్రధాని మోదీ దృష్టికి ఈ అంశం వెళ్లినట్లుగా తెలుస్తోంది.      

ఫేక్ వీడియోలు అని కేసులు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం           

అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ వీడియోలన్నీ ఫేక్ అని.. వన్యప్రాణులన్నీ..  రెండు వేల ఎకరాల మేర విస్తరించి ఉన్న హెచ్‌సీయూ యూనివర్శిటీలో ఉన్నాయని.. అక్కడే ఏదో జరుగుతోందని అంటోంది. అంతే కాదు ఫేక్ వీడియోలను సృష్టించిన వారిపై .. ప్రచారం చేసిన వారిపై కేసులు పెడుతోంది. అవన్నీ ఏఐ వీడియోలని పోలీసులు ఫోరెన్సిక్ నుంచి నిర్ధారణ తీసుకు వచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే అక్కడ అడవిని నాశనం చేస్తున్నారని.. వన్య ప్రాణుల్ని చంపేస్తున్నారని చెప్పడంతో రాజకీయంగా కొత్త కలకలం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.   

ప్రధాని మోదీ తీరుపై ఇటీవల రేవంత్ విమర్శలు చేస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సమావశంలో బీజేపీ, బ్రిటిష్ వాళ్ల కన్నా  డేంజర అని విర్శించారు.                   

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget