అన్వేషించండి

KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్

ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Congress SC declaration In Telangana | హైదరాబాద్: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు పార్టీ జాతీయ నేతలు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలుకూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన మోసాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ డిక్లరేషన్ అమలులో పూర్తిగా విఫలమైంది, దళిత డిక్లరేషన్ ఇచ్చిన హామీల సంగతి ఏమైంది. ఎస్సీ డిక్లరేషన్ అంశంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ పాపాలకి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి (Revanth Reddy) లాంటి మోసగాడు చెప్తే నమ్మరని, మల్లికార్జున ఖర్గేను తెలంగాణకు రప్పించి మరీ ఎస్సీ రిజర్వేషన్ ప్రకటన చేయించారు. మల్లికార్జున ఖర్గే మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి. 

రేవంత్ రెడ్డి లాంటి మోసగాడి పాలన ఈరోజు చూసుంటే రాజ్యాంగ నిర్మాతలు రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టేవారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు తెలంగాణ భవన్‌లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

 

అసమర్ధ పాలనతో ఎండిన పొలాలు, అన్ని వర్గాల కళ్లళ్లోనూ నీళ్లు.. కాంగ్రెస్ అంటే కరువు.. కరువు అంటే కాంగ్రెస్! అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నాడు బీఆర్ఎస్ హయాంలో పంటలు పచ్చగా కళకళలాడేవి. నేడు కాంగ్రెస్ పాలనతో పొలాలు ఎండిపోతున్నాయి. కక్షతో కాళేశ్వరం పంపులను పడావుపెట్టి, నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కనపెట్టారు. గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరదలు వచ్చినా నీటిని ఒడిసిపట్టుకోకుండా వదిలేసిన ఫలితం ఎండిన పంట పొలాలు అన్నారు. తాగునీళ్లు లేక గొంతులు తడారుతున్నాయి.

పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయె. తలాపునా పారుతుంది గోదారి. మన సేను, మన సెలుక ఎడారి. నాడు కేసీఆర్ గారి పాలనలో జలకళ కనిపిస్తే.. నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో విలవిల. నాడు ఇంటింటికి నల్లానీళ్లు రాగా, నేడు ఆడబిడ్డల కండ్లల్లో కన్నీళ్లు. ఇది శ్రీశైలం, సాగర్ జలాశయాలను ఏపీ సర్కారు ఖాళీ చేస్తున్నా నోరెత్తని కాంగ్రెస్ సర్కారు తప్పిదం. కాళేశ్వరం నుండి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ గారి మీద కక్షతో రిజర్వాయర్లను, చెరువులు, కుంటలు నింపని కాంగ్రెస్ పాపం. ఇది కాలం పెట్టిన శాపం కాదు. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పెట్టిన శఠగోపం. జాగో తెలంగాణ జాగో!’ అని ఎక్స్ ఖాతాలో కేటీఆర్ పోస్ట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayush Mhatre Record: నిన్న వైభవ్,  నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
నిన్న వైభవ్, నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP DesamAvesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayush Mhatre Record: నిన్న వైభవ్,  నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
నిన్న వైభవ్, నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Vishwambhara: విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ @ 75 కోట్లు... మీడియం రేంజ్ హీరోతో సినిమా తీయొచ్చు ఏమో కదా!
విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ @ 75 కోట్లు... మీడియం రేంజ్ హీరోతో సినిమా తీయొచ్చు ఏమో కదా!
Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
MI vs CSK: ముంబైతో మ్యాచ్.. సీఎస్కేదే ఫస్ట్ బ్యాటింగ్, రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే
ముంబైతో మ్యాచ్.. సీఎస్కేదే ఫస్ట్ బ్యాటింగ్, రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే
Kakinada DCCB Chairman: కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
Embed widget