Vizag Crime News: రెండు రోజుల్లో డెలివరీ - పుట్టబోయే బిడ్డను, భార్యను చంపేసిన భర్త - విశాఖలో ఘోరం
Wife Murder: పుట్టబోయే బిడ్డ కోసం కలలు కనాల్సిన ఆ కాబోయే తండ్రి బిడ్డతో పాటు తల్లిని కూడా చంపేశాడు. ఎన్ని విబేధాలున్నా అలా ఎలా చంపుతాడని అందరూ షాక్‌కు గురయ్యారు.

Vizag husband strangled his pregnant wife to death : భార్య గర్భంతో ఉంటే ఏ భర్త అయిన డెలివరీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పుట్టబోయే బిడ్డ కోసం చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బిడ్డ పుడితే ఎప్పుడు తన చేతుల్లో తీసుకుని ఆడిస్తానా అని ఆతృత పడుతూ ఉంటాడు. కానీ ఈ ప్రపంచంలో పుట్టబోయే బిడ్డతో పాటు.. తల్లిని కూడా చంపేసేంత మూర్ఖులు కొంత మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు విశాఖకు చెందిన జ్ఞానేశ్వరరావు.
అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించాలనుకున్న జ్ఞానేశ్వరరావు
విశాఖ పీఎం పాలెం లో ఉండే అనూష హఠాత్తుగా చనిపోయింది. మరణం అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వచ్చారు. అయితే అనూష భర్త జ్ఞానేశ్వర్ రావు మాత్రం పెద్దగా బాధపడకుండా సైలెంట్ గా ఉన్నాడు. నిజానికి అనూష తొమ్మిది నెలల గర్భిణి . రెండు రోజుల్లో డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరాల్సి ఉంది. అయినా జ్ఞానేశ్వరరావు సైలెంట్ గా ఉండటంతో పోలీసులు అనుమానపడ్డారు. గొంతు చుట్టూ పిసికినట్లుగా గుర్తులు కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దాంతో అసలు విషయం బయట పెట్టాడు. డెలివరీకి వెళ్లాల్సిన తన భార్యను గొంతు పిసికి చంపేసినట్లుగా అంగీకరించాడు.
పుట్టకుండానే బిడ్డనూ చంపేసుకున్న జ్ఞానేశ్వరరావు
అతను చంపింది భార్యను మాత్రమే కాదు.. పుట్టబోయే తన బిడ్డను కూడా అనే సంగతిని గుర్తుంచుకున్నాడో లేదో కానీ.. పోలీసులు అసలు విషయం బయటకు తెచ్చారు. అనూషను.. జ్ఞానేశ్వర్ రావు .. ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అనూష గర్భవతిగా ఉన్నప్పుడు బాగానే చూసుకున్నాడు. ఫోటో షూట్స్ కూడా చేసుకున్నారు. కానీ ఏ విషయంలో తేడా వచ్చిందో కానీ.. భార్యతో గొడవ పడ్డారు. ఆ గొడవ రాను రాను పెద్దది అయిపోయింది. చివరికి అది హత్యకు దారి తీసింది.
పోలీసుల ట్రీట్ మెంట్‌తో నిజం చెప్పిన జ్ఞానేశ్వరరావు
గొడవ జరిగినప్పుడు క్షణికావేశంలో చంపేశాడా లేకపోతే ప్లాన్డ్ గా చంపేసి.. గర్భం కారణంగా ఏదో అనారోగ్యం కలిగి చనిపోయిందని నిరూపించాలని ప్లాన్ చేసుకున్నాడో కానీ చంపేశాడు. తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే గొంతు పిసికి చంపి.. చడావుడిగా.. భార్యకు ఒంట్లో బాగాలేదని ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. చివరికి పోలీసుల జోక్యంతో అసలు విషయం బయటపడింది.
కుటుంబ వివాదాల కారణంగా చాలా మంది గొడవలు పడుతూ ఉంటారు . కొంత మంది చంపడమో.. ఆత్మహత్యలు చేసుకోవడమో లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలా నిండు గర్భిణిగా.. పుట్టబోయే తన బిడ్డను కూడా చూసుకోకుండా ఆ బిడ్డ కూడా చనిపోయిందని తెలిసి కూడా భార్యను చంపేంత క్రూరులు అరుదుగా ఉంటారు. ఈ జ్ఞానేశ్వరరావు అంత కర్కోటకుడు. అతడు ఇప్పుడు ఒకటి కాదు.. రెండు హత్యలు చేసినట్లు.





















