అన్వేషించండి

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు

Raj Kasireddy : ఏపీ లిక్కర్ స్కాంలో కీలక సూత్రధారిగా ఉన్న రాజ్ కసిరెడ్డి కోసం సిట్ గాలింపు నిర్వహిస్తోంది. అనుమానం ఉన్న పలు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.

SIT is conducting a search for Raj Kasireddy: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి కోసం సిట్ బృందాలు గాలింపు ప్రారంభించాయి. హైదరాబాద్‌లో అరెటా హాస్పిటల్‌తో పాటు మరికొన్ని చోట్ల సిట్ బృందాలు సోదాలు చేస్తున్నాయి.  హైదరాబాద్‌లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లోనూ సోదాలు చేస్తున్నారు.   దాడుల్లో పాల్గొంటున్న సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు పాల్గొంటున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కాంపై సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ముందస్తు బెయిల్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించినా విచారణకు హాజరు కావడం లేదు. 

ఏపీ లిక్కర్ స్కాంలో సైలెంట్ గా విచారణ జరుపుతున్న సీఐడీ 

ఏపీ మద్యం స్కాంలో సైలెంట్‌గా సీఐడీ సిట్  తన తాను పని చేసుకుపోతోంది. కీలక పాత్రధారులకు నోటీసులు జారీ చేస్తోంది. వారంతా కోర్టుకు వెళ్తున్నారు. కానీ హైకోర్టులో మాత్రం సానుకూల ఫలితం రావడం లేదు. ఏపీ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు.  రాజ్ కసిరెడ్డిపై  సీఐడీ ఎప్పుడో దృష్టి పెట్టింది. నోటీసులు జారీ చేసింది. ఆయన నోటీసులను తాజాగా హైకోర్టులో సవాల్ చేశారు. తనపై దూకుడైన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసి ఆయన పిటిషన్ డిస్మిస్ చేసింది.   

జగన్ హయాంలో ఐటీ సలహాదారుగా చేసిన రాజ్ కసిరెడ్డి 

కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి జగన్ ఐటీ సలహాదారుగా నియమించారు.  ఏపీ లిక్కర్ స్కాంపై సీఐడీ చాలా లోతుగా దర్యాప్తు చేసింది. చాలా విషయాలు వెలుగులోకి తెచ్చిందని చెబుతున్నారు.   ఏపీబీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మొత్తం వ్యవహారాలపై రోజుల తరబడి స్టేట్ మెంట్ ఇచ్చారు. న్యాయమూర్తి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ స్కాంలో కీలకంగా ఉన్న వారి గుట్టు అంతా బయటపడుతోందని చెబుతున్నరాు. ఇప్పటికే మిథున్ రెడ్డికి ఈ స్కాంలో  ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే ఆయన సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు.  

కొంత కాలంగా పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డి                           

వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి . వైసీపీ గెలవగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. మద్యనిషేధం పేరిట దుకాణాలు తగ్గిస్తామని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా బయట దొరికే బ్రాండ్ల మద్యం మొత్తం ఏపీలో బ్యాన్ చేశారు. కేవలం కొన్ని కంపెనీలు.. అది కూడా ఏపీ లోనే మద్యం అమ్మే కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు. అవన్నీ వైసీపీ నేతలవన్న ఆరోపణలు ఉన్నాయి.  టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిపై దర్యాప్తు ప్రారంభించింది.  ఈడీ కూడా విచారణ చేయాలని సిఫారసు చేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

AP Telangana Weather Update: ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
YS Jagan Mohan Reddy New Strategy: జగన్ తాడేపల్లి వైరాగ్యానికి తెర! రెండేళ్ల ఓటమి తర్వాత రూట్ మార్చిన వైఎస్సార్‌సీపీ అధినేత.. వైజాగ్ పర్యటన వెనుక అసలు వ్యూహం ఇదే!
జగన్ తాడేపల్లి వైరాగ్యానికి తెర! రెండేళ్ల ఓటమి తర్వాత రూట్ మార్చిన వైఎస్సార్‌సీపీ అధినేత.. వైజాగ్ పర్యటన వెనుక అసలు వ్యూహం ఇదే!
Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
US Attacks Iran: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
Future City Hyderabad: ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
AP Telangana Weather Update: ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
Mohammed Siraj News: ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ముందు ఇండియా టీమ్‌లో సడన్ చేంజ్, ఆ స్టార్ బౌలర్ అవుట్.. రీప్లేస్‌మెంట్‌గా దూసుకొచ్చిన కొత్త స్పీడ్‌స్టర్!
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ముందు ఇండియా టీమ్‌లో సడన్ చేంజ్, ఆ స్టార్ బౌలర్ అవుట్.. రీప్లేస్‌మెంట్‌గా దూసుకొచ్చిన కొత్త స్పీడ్‌స్టర్!
Gold Price 2026: అక్టోబర్ 31 వరకూ బంగారం ధరలు స్థిరంగా ఉంటాయా? పెరుగుతాయా? ఇక్కడ తెలుసుకోండి!
2026 అక్టోబర్ 31 వరకూ బంగారం ధరలు స్థిరంగా ఉంటాయా? పెరుగుతాయా? ఇక్కడ తెలుసుకోండి!
Peddi Collections Day 6: 'పెద్ది' కలెక్షన్లు... రోజుకు పది కోట్లు కష్టమేనా? ఆరు రోజుల్లో రామ్ చరణ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'పెద్ది' కలెక్షన్లు... రోజుకు పది కోట్లు కష్టమేనా? ఆరు రోజుల్లో రామ్ చరణ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget