Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Nara Lokesh: గురువారం రాత్రి తిరుపతికి వచ్చిన మంత్రి నారా లోకేశ్ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ వ్యవహారం గురించి మాట్లాడారు.
Nara Lokesh YV Subba Reddy: తిరుమల లడ్డూ తయారీకి జంతువు కొవ్వు వాడిన మాట నిజమే అని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఇలా తిరుమలను అపవిత్రం చేసిన వారు ఎవరైనా వారిని వదలబోమని మంత్రి తేల్చి చెప్పారు. తిరుమల లడ్డూ అపవిత్రం అయిందని తాము ఆధారాలు చూపించామని.. ల్యాబ్ రిపోర్ట్ లు కూడా ముందు పెట్టామని లోకేశ్ చెప్పారు. ఇంకా ఏం నిరూపించాలని ప్రశ్నించారు. తిరుపతికి వచ్చిన మంత్రి నారా లోకేశ్ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా టీటీడీ మాజీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డికి సవాలు విసిరారు. తాను తిరుపతిలోనే ఉన్నానని.. అవసరమైతే ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రమాణం చేసేందుకు మీరు రెడీనా? అని నారా లోకేశ్ సవాలు విసిరారు. లేదంటే జగన్ నువ్వు వస్తావా? అని లోకేశ్ మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవదేవుని మహా ప్రసాదంగా భావించే లడ్డూలో గొడ్డు మాంసం కలిపారని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వెల్లడించిందని లోకేశ్ తెలిపారు. ఈ విషయంలో అందరి పైనా చర్యలు ఉంటాయని.. శిక్షలు ఉంటాయని లోకేశ్ తేల్చి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డికి దేవుడిపైనా నమ్మకం లేదని.. ప్రజలపైనా నమ్మకం లేదని.. ప్రజలు ఇచ్చిన తీర్పుపైనా నమ్మకం లేదని లోకేశ్ అన్నారు.
సుబ్బారెడ్డి.. నేను తిరుపతిలోనే ఉన్నా.. ప్రమాణానికి సిద్ధంగా ఉన్నా. మీరు రెడీనా ?
— Telugu Desam Party (@JaiTDP) September 19, 2024
జగన్ నువ్వు వస్తావా ?#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/oaJMpFlNoL
తిరుమల లడ్డూ తయారీకి జంతువు కొవ్వు వాడింది నిజమని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలింది. ఎవరైతే ఈ చర్య వెనుక ఉన్నారో, అందరి పైనా చర్యలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి.#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/83uZqFpAIT
— Telugu Desam Party (@JaiTDP) September 19, 2024
దేవుడిపైనా జగన్ రెడ్డికి నమ్మకం లేదు.. ప్రజలపైనా నమ్మకం లేదు.. ప్రజలు ఇచ్చిన తీర్పుపైనా నమ్మకం లేదు..
— Telugu Desam Party (@JaiTDP) September 19, 2024
ఆధారాలు చూపించాం.. ల్యాబ్ రిపోర్ట్ లు ముందు పెట్టాం. ఇంకా ఏమి నిరూపించాలి ?#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/zl4WpTUBAw
తిరుమల తిరుపతి దేవదేవుని మహా ప్రసాదంగా భావించే లడ్డూలో గొడ్డు మాంసం కలిపారని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వెల్లడించింది.#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/CgIdzTPxCk
— Telugu Desam Party (@JaiTDP) September 19, 2024