By: ABP Desam | Updated at : 09 Jan 2022 08:42 AM (IST)
నెల్లూరులో నయా ట్రెండ్ - స్కూటర్ బీబీక్యూ
బుల్లెట్ బీబీక్యూ. గోవా, ముంబయి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇదో హాట్ ట్రెండ్. బుల్లెట్ బండికి ఓ చిన్న టైప్ కిచెన్ సెటప్ చేసుకుని స్ట్రీట్ ఫుడ్ ని హాట్ హాట్ గా రెడీ చేస్తుంటారు. అయితే నెల్లూరు లాంటి పట్టణంలో ఇలాంటిది కనిపించడం అరుదు. కానీ ఆ ట్రెండ్ ని కొంతమంది యువకులు నెల్లూరుకి పరిచయం చేశారు. అయితే బుల్లెట్ బీబీక్యూ కాస్త కాస్ట్ లీ అని, అందుకే ఇలా స్కూటర్ బీబీక్యూని రెడీ చేశామంటున్నాడు.. ఈ యువకుడు.
అదిరిపోయే స్టార్టప్..
యువత అంతా చదువుకుని ఉద్యోగాలే చేయాలనుకోవట్లేదు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్ మెంట్ చేస్తున్న యువత, చదువుకుంటూనే స్టార్టప్ ల వైపు వెళ్లాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే మదన్ తేజ అనే యువకుడు ఈ స్కూటర్ బీబీక్యూ తయారు చేశాడు.
హాట్ చిక్ బీబీక్యూలో గ్రిల్స్, రోల్స్ తో మొదలు పెట్టారు. త్వరలో రీఫ్రెష్ మెంట్స్ స్టార్ట్ చేస్తామంటున్నారు. చికెన్ స్టిక్స్, కబాబ్స్, లెగ్ పీస్ లు ఇక్కడ బాగా ఫేమస్. చికెన్ బర్గర్ కూడా ఇక్కడ అదిరిపోతుందని అంటున్నారు. దాదాపుగా చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పటికే ఈ స్కూటీ బీబీక్యూకి అలవాటు పడ్డారు.
ఓన్ ప్రిపరేషన్..
నెల్లూరులోని మాగుంట లే అవుట్, మినీ బైపాస్ వద్ద ఈ హాట్ చిక్ బీబీక్యూ మొదలు పెట్టారు. వాహనంతోపాటు.. అన్నీ ఓన్ ప్రిపరేషన్ అంటున్నారు. రూమ్ వద్ద అన్నీ రెడీ చేసుకుని మినీ బైపాస్ కి వాహనంలో తీసుకొస్తారు. ఇక్కడ వేడివేడిగా వాటిని వండి వడ్డిస్తారు. వంటకోసం వాడే పేస్ట్ కానీ, ఇతర పదార్థాలు, పౌడర్లు అన్నీ తన ఓన్ ప్రిపరేషన్ అంటున్నారు. కొంతమంది ఫ్రాంచైజీలను కూడా అడుగుతున్నారని సంతోషంగా చెబుతున్నారు దీని నిర్వహకులు.
కొత్త దనాన్ని ఆస్వాదించడం, అందులోనూ పుడ్ ఐటమ్స్ కి సంబంధించి కొత్తదనానికి స్వాగతం చెప్పడం నెల్లూరోళ్లకు ఎప్పటినుంచో అలవాటు. అందులోనూ ఇలా వెరైటీగా.. సిటీ కల్చర్ ని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన స్కూటర్ బీబీక్యూకి ఇప్పుడు కస్టమర్లు క్యూ కడుతున్నాడు. ఒకసారి వచ్చినవారు కచ్చితంగా రెండోసారి రావాల్సిందే, తమ ఫ్రెండ్స్ ని కూడా ఇక్కడకు తేవాల్సిందే.
Also Read: Nellore News: నీకు నా మొగుడే కావాలా..? సచివాలయంలో మహిళల కొట్లాట..
Also Read: TDP One Side Love : ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ ! క్లైమాక్స్ మలుపు తిప్పుతుందా ?
Also Read: AP Farmers: ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు.. త్వరలోనే సబ్సిడీ, పంటలకు రుణాలు
Also Read: Crime News: ఇద్దరు సత్రంలో.. మరో ఇద్దరు కృష్ణానదిలో.. విజయవాడలో తెలంగాణవాసుల సూసైడ్
Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్, ఆత్మకూరు ఉపఎన్నిక కోసం పగడ్బందీ ఏర్పాట్లు
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న
Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి
Atmakur Elections : ఆత్మకూరులో పోటీపై తేల్చని పార్టీలు - విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థేనా ?
Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Xiaomi New TV: ఈ టీవీ ఇంట్లో ఉంటే థియేటర్‌కి వెళ్లక్కర్లేదుగా - అదిరిపోయే ఎక్స్పీరియన్స్!