Rashmika Mandanna: మరోసారి వీల్ ఛైర్‌లోనే రష్మిక... ‘ఛావా’ హైదరాబాద్ ప్రమోషన్స్‌లో హైలైట్స్
Chhaava Movie: ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమైన ‘ఛావా’ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికీ రష్మిక వీల్ ఛైర్‌లోనే వచ్చింది.

‘ఛావా’.. కొన్ని రోజులుగా ఈ పేరు బాగా వినబడుతుంది. కారణం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. బాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్కీ కౌశల్‌తో కలిసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఎక్కడపడితే అక్కడ విక్కీ, రష్మీక జంట వాలిపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక తన కాలికి ఓ కట్టేసుకుని, కుంటుకుంటూ కనబడుతుండటం హైలెట్ అవుతోంది.
రష్మిక తన కాలికి గాయమైనా సరే ప్రమోషన్స్ విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఆవిడ సంగతి పక్కన పెడితే.. ‘ఛావా’ మాత్రం బాగానే ప్రేక్షకులలోకి వెళుతుంది. మరీ ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాను చూసే కోణమే మారిపోయింది. బాలీవుడ్‌తో పాటు, సౌత్‌లోనూ ఈ సినిమాపై క్రేజ్ బాగానే ఏర్పడింది. ఆ క్రేజ్‌ని సినిమా విడుదల వరకు అలానే కాపాడుకునేందుకు చిత్ర టీమ్ అదే స్థాయిలో కష్టపడుతుంది. ఈ మూవీ ప్రమోషన్ నిమిత్తం తాజాగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనూ రష్మిక వీల్ ఛైర్‌లోనే కనిపించి.. సినిమా కోసం తనెంతగా ప్రాణం పెట్టేస్తుందో.. మరోసారి క్లారిటీ ఇచ్చింది.
ఇక ఈ కార్యక్రమంలో హీరో విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. ‘ఛావా’ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతగానో మనసు పెట్టి ప్రిపేర్ అయ్యాను. వార్ సన్నివేశాలు, గుర్రపు స్వారీ కోసం శిక్షణ కూడా తీసుకున్నాను. ఇవి ఎన్ని ఉన్నా కూడా.. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు నా మనసుని సన్నద్దం చేసుకోవడం నిజంగా సవాలుగా అనిపించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీరాముని వంటి వారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ సింహం వంటి యోధులు. ఈ పాత్రలను ఇంత కంటే గొప్పగా నేను వర్ణించలేను. దర్శకుడు లక్ష్మణ్ మొదటి నుంచి కూడా నన్ను పాత్ర పేరుతోనే పిలుస్తుంటారు. నేను ఈ పాత్రను పోషించగలను అనే నమ్మకాన్ని అలా ఆయన నాలో ముందు నుంచీ కలిగిస్తూనే వచ్చారు. నిజమైన యోధుడి కథను చెబుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన దినేష్ విజన్, తెరకెక్కించిన లక్ష్మణ్‌కు ధన్యవాదాలు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచేసింది. ఇలాంటి పాత్ర నాకు దొరకడం నా అదృష్టం. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమా అందరూ థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నానని అన్నారు.
రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘ఛావా’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. నేను మనసు పెట్టి చేసిన సినిమా. ఈ చిత్రంలో మాటలకు అందని భావం ఉంటుంది. ఇందులో ఓ దైవత్వం ఉంటుంది.. అంతులేని ప్రేమ ఉంటుంది.. అందుకే ఈ కథ వినగానే చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ మూవీని చూసిన ప్రతీ సారి నేను ఏడ్చేస్తాను. అంత అద్భుతంగా ఉంటుంది. ఏ ఆర్ రెహమాన్ సర్ మ్యూజిక్, ‘జానే తూ’ అనే పాట అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. విక్కీ చుట్టూ అద్భుతమైన ఆరా ఉంటుంది. ఆయన పక్కన నిలబడితేనే ఓ పాజిటివ్ వైబ్, ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఛావా పాత్రకు విక్కీ అద్భుతంగా సెట్ అయ్యారు. అందుకే లక్ష్మణ్ సర్ విక్కీని ఈ పాత్రకు సెలక్ట్ చేశారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

