Sarkaar Season 5 OTT Streaming Date: 'సుడిగాలి' సుధీర్ 'సర్కార్' సీజన్ 5కి సిద్ధమా ? స్ట్రీమింగ్ డేట్, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ డీటెయిల్స్ ఇవే
Sarkaar Season 5 OTT release : సుడిగాలి సుధీర్ 'సర్కార్' సీజన్ 5 గేమ్ షో స్ట్రీమింగ్ డేట్, ఓటీటీ వివరాలు... ఈ సీజన్లో సర్ప్రైజ్ లు ఏంటంటే ?

బుల్లితెరపై కమెడియన్ గా, మరోవైపు వెండి తెరపై హీరోగా ఆకట్టుకుంటున్న నటుడు సుడిగాలి సుధీర్. 'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన సుధీర్ త్వరలోనే ఆహా ఓటీటీ షో 'సర్కార్ సీజన్ 5'తో పలకరించబోతున్నారు. గత సీజన్ లో సుధీర్ హోస్ట్ గా చేసిన ఈ షో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సీజన్ 5 కు హోస్ట్ గా సుధీర్ చేయబోతున్నాడా ? లేదంటే మళ్ళీ మారే ఛాన్స్ ఉందా? ఈసారి షోలో భాగం కాబోయే సెలబ్రిటీలు ఎవరు? అన్న విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఈ షో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.
'సర్కార్ సీజన్ 5' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న రియాల్టీ షో 'సర్కార్'. ఈ 'సర్కార్' అనే సెలబ్రిటీ గేమ్ షో 2021లోనే మొదలైంది. తమిళంలో ఈ షోకి జీవా హోస్ట్ చేయగా, ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలోనే ఐదో సీజన్లోకి అడుగు పెట్టబోతోంది. ఈ షోకి గతంలో మరో యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించారు. కానీ 'సర్కార్ సీజన్ 4' నుంచి ఈ షోకి ప్రదీప్ కి బదులుగా సుడిగాలి సుధీర్ హోస్ట్ గా మారారు. కాగా సీజన్-5కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇక కొత్త సీజన్ మార్చ్ 28న ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ కాబోతోంది. అయితే ఈసారి సీజన్ 5 మునుపటి కంటే బెటర్ గా, మరింత భారీగా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే ఈ కొత్త సీజన్లో ఎక్కువ మంది సెలబ్రిటీలను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట. గత సీజన్లో కాజల్ అగర్వాల్ తో సహా అనేక మంది సెలబ్రిటీలు ఈ షోకి విచ్చేసి సందడి చేశారు. అంతే కాకుండా 'సర్కార్ సీజన్ 5'కి సుడిగాలి సుధీర్ తో పాటు మరో టీవీ సెలబ్రిటీ కూడా పోస్ట్ గా మారబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
సుడిగాలి సుధీర్ అప్ కమింగ్ సినిమాలు
2022లో సుధీర్ 'గాలోడు' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, పెద్దగా ఆశించిన ఆదరణ దక్కలేదు. కానీ ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అయింది. సుడిగాలి సుధీర్ చివరిసారిగా 'సహస్ర' అనే థ్రిల్లర్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఆ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నెక్స్ట్ సుధీర్ 'గోట్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇందులో ఆయనతో దివ్య భారతి హీరోయిన్ గా స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. ఈ మూవీ 2025లోనే విడుదల అయ్యే అవకాశం ఉంది.
Also Read: సింగర్ కల్పన కెరీర్‌లో బెస్ట్ తెలుగు సాంగ్స్... 1500 పాటల్లో, తెలుగులో టాప్ 10 లిస్ట్ ఇదిగో





















