Hyderabad Crime News: హైదరాబాద్‌లో రియల్టర్ దారుణహత్య! కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసిన భార్య
Hyderabad News | హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో దారుణం జరిగింది. ఓ రియల్టర్ భార్య చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. నిందితులే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోవడంతో హత్య విషయం వెలుగు చేసింది.

బండ్లగూడ: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. రియల్టర్‌గా మారిన వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిసి పోలీసులు షాకయ్యారు. మూడో భార్య, ఆమె కుమారుడు కలిసి కత్తితో రియల్టర్ మసీయుద్దీన్ గొంతు కోసి హత్య చేశారు. చివరికి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో నిందితులు లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
బంజారా హిల్స్ కు చెందిన 57 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ మసీయుద్దీన్ కొన్నేళ్ల కిందట షబానాను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇదివరకే రెండుసార్లు వివాహం కాగా, షబానా అతడికి మూడో భార్య. మరోవైపు షబానాకు సైతం ఇదివరకే వివాహమైంది. ఆమెకు మొదటి భర్త ద్వారా కుమారుడు సమీర్ ఉన్నాడు. షబానా తన కుమారుడు సమీర్ తో కలిసి బండ్లగూడ క్రిస్టల్ టౌన్‌షిప్ లోని అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. రియల్టర్ మసీయుద్దీన్ తరచుగా షబానా ప్లాట్ కు వచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో సోమవారం భార్యాభర్తల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. మసీయుద్దీన్ మంగళవారము ఉదయం మరోసారి షబానా ప్లాట్ కు వచ్చాడు. ఆ సమయంలో షబానా ఫ్లాట్లో ఆమె కుమారుడు సమీర్, అతడి ఫ్రెండ్ ఫరీద్ ఉన్నారు.
కుమారుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్
షబానా, మసీయుద్దీన్ మధ్య మంగళవారం మరోసారి వాగ్వాదం మొదలైంది. సోమవారం గొడవ అనంతరం మసీయుద్దీన్ హత్యకు మూడో భార్య షబానా ప్లాన్ చేసింది. మరుసటి రోజ మసీయుద్దీన్ ఫ్లాట్‌కు రాగా, గొడవ జరగడంతో ప్లాన్ ప్రకారం కుమారుడు సమీర్ తో కలిసి భర్త చేతులు విరిచేసి, చున్నీతో చేతులు కట్టేసింది. సమీర్ అతడి స్నేహితుడు మసీయుద్దీన్ కాళ్లను సైతం సైతం కట్టేశారు. మసీయుద్దీన్ గట్టిగా కేకలు వేయకుండా అతడి నోట్లో గుడ్డలు సైతం కుక్కారు. ఆ తర్వాత తల్లి కొడుకులు కలిసి కత్తితో మసీయుద్దీన్ గొంతు కోయగా, తీవ్ర రక్తస్రావమై విలవిల్లాడుతూ చనిపోయాడు.
ఈ విషయం ఎలాగైనా బయటపడుతుందని అరెస్ట్ అవ్వడం తప్పదని ఆందోళనకు గురైన షబానా ఆమె కుమారుడితో కలిసి మంగళవారం రాత్రి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో విషయం వెలుగు చూసింది. తనతో గొడవ పడుతున్నాడని మసీయుద్దీన్ ను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షబానాకు ఉన్న వివాహేతర సంబంధమే ఆమె భర్త, రియల్టర్ మసీయుద్దీన్ హత్యకు దారితీసిందని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు ఈ కోణంలోనూ విచారణ చేపట్టారు.
Also Read: Crime News: తన భార్యకు వాట్సాప్‌లో ముద్దు, వివాహేతర సంబంధం ఉందని ఇద్దర్నీ నరికి హత్య చేసిన భర్త






















