అన్వేషించండి

US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం

Plane Crash in Philadelphia | అమెరికాలో మరో విమానం క్రాష్ అయింది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చిన్న విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు.

Jet Crashes Near Shopping Mall After Take Off In Philadelphia | ఫిలడెల్ఫియా: అమెరికాలో మరో విమాన ప్రమాదం సంభవించింది. ఇటీవల భారీ విమాన ప్రమాదం జరిగిన ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఓ విమానం అకస్మాత్తుగా క్రాష్ అయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ చిన్న విమానం ఈశాన్య ఫిలడెల్ఫియాలో శుక్రవారం సాయంత్రం కుప్పకూలింది. భారీ పేలుడు సంభవించి అక్కడ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం క్రాష్ అయిన చోట కొన్ని ఇళ్లు, వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. భారీ పేలుడుతో షాపింగ్ కాంప్లెక్స్, జనావాసాల మధ్య విమాన ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, ఎమర్జెన్సీ సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.

టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ఒక చిన్న విమానం ఈశాన్య ఫిలడెల్ఫియాలో షాపింగ్ మాల్ సమీపంలో క్రాష్ అయిందని పెన్సిల్వేనియా గవర్నర్ శుక్రవారం వెల్లడించారు.  వ్యాపార జెట్‌లు, చార్టర్డ్ విమానాలకు సేవలందించే ఈశాన్య ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్టు నుంచి కేవలం 4 కిలోమీటర్ల లోపే ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ చేసింది. క్రాష్ అయిన చోట సమీపంలోని ఇండ్లకు మంటలు అంటుకున్నాయి. విమాన ప్రమాదంతో అక్కడ షాపింగ్ మాల్స్ తాత్కాలికంగా క్లోజ్ చేశారని ఫిలడెల్ఫియాలోని అత్యవసర సేవల నిర్వహణ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6:06 గంటలకు ఎయిర్ పోర్ట్ నుంచి చిన్న జెట్ టేకాఫ్ అయింది. 1,600 అడుగుల ఎత్తుకు చేరుకోగా, కేవలం 30 సెకన్ల తర్వాత రాడార్ నుండి దాని సమాచారం లేదని విమాన డేటా చూపించింది.

 వాషింగ్టన్ సమీపంలో జనవరి 31న ఆర్మీ హెలికాఫ్టర్, ఓ విమానం ఢీకొన్న ప్రమాదంలో 64 మంది మృతిచెందారని తెలిసిందే. ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా సమాచారం చేరవేసి, కమ్యూనికేట్ చేసి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
AP DSC 2025: ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
Shine Tom Chacko: హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
AP DSC 2025: ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
Shine Tom Chacko: హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
Pawan Kalyan: పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
Discount on iPhone: ఐఫోన్ 15ని చవకగా కొనే ఛాన్స్‌ - చాలా ఫోన్ల మీద గ్రేట్‌ డీల్స్
ఐఫోన్ 15ని చవకగా కొనే ఛాన్స్‌ - చాలా ఫోన్ల మీద గ్రేట్‌ డీల్స్
KTR News: HCU భూ వివాదంపై రేవంత్ రెడ్డిని విచారిస్తారా? లేదా? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
HCU భూ వివాదంపై రేవంత్ రెడ్డిని విచారిస్తారా? లేదా? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
Best Car In The World: 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌ దీనిదే, ఈ కార్‌ని మన దేశంలో కొనొచ్చా?
'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌ దీనిదే, ఈ కార్‌ని మన దేశంలో కొనొచ్చా?
Embed widget