Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!

Mla Kotamreddy Sridhar Reddy : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

FOLLOW US: 

Mla Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 47 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. శుక్రవారం కూడా ఓ కుటుంబం ఇంట్లోనే ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. సాయంత్రం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి చెన్నై అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. నెల్లూరులో ఆయనను మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆమంచర్ల గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అక్కడే స్థానికులతో కలిసి భోజనం కూడా చేశారు.

ఛాతిలో నొప్పి

ఆమంచర్ల పర్యటనలో ఉన్నప్పుడు స్వల్పంగా ఛాతిలో నొప్పి రాగా కోటంరెడ్డి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆయన్ను నిలువరించి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో ఆయన నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. విశ్రాంతి తీసుకునే క్రమంలో ఛాతి నొప్పి అధికం కావడంతో వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు సమీపంలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అపోలో హాస్పిటల్ లో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. అనంతరం చెన్నైకి తరలించారు. 

" జగనన్న మాట కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట కార్యక్రమంతో గత 47 రోజులుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ ఆమంచర్ల గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. అలసటతో నిరసనగా ఉన్న ఆయను నెల్లూరు ఆసుపత్రికి తీసుకొచ్చాం. వైద్యుల సలహాలతో ఆయను అంబులెన్స్ లో చెన్నైకు తరలించాం. ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు నొప్పి వచ్చినా అంతగా పట్టించుకోలేదు. ఇవాళ నొప్పి కొంచెం ఎక్కువగా వచ్చింది. నడవలేని పరిస్థితిలో ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పట్టారు. ఆయనకు త్వరలోనే నయం అవుతుందని ఆశిస్తున్నాం. "
-కోటంరెడ్డి సోదరుడు

Also Read : AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

Also Read : Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్, ఆత్మకూరు ఉపఎన్నిక కోసం పగడ్బందీ ఏర్పాట్లు

Published at : 27 May 2022 06:39 PM (IST) Tags: AP News Nellore news ysrcp mla kotamreddy sridhar reddy chest pain chennai apollo

సంబంధిత కథనాలు

Crime News: విక్రమార్కుడు సినిమాలో రవితేజ లెక్క చేసింది- అక్కడ గుండుతోనే పోయింది- ఇక్కడ మాత్రం?

Crime News: విక్రమార్కుడు సినిమాలో రవితేజ లెక్క చేసింది- అక్కడ గుండుతోనే పోయింది- ఇక్కడ మాత్రం?

Kurnool News: ఆమె కళ్లు మరో వందేళ్లు ఈ ప్రపంచాన్ని చూస్తాయి- నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపిన చరిత

Kurnool News: ఆమె కళ్లు మరో వందేళ్లు ఈ ప్రపంచాన్ని చూస్తాయి- నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపిన చరిత

AP Schools: ప్రభుత్వ పాఠశాలల విలీనంపై ప్రజల ఆగ్రహం- చిత్తూరు, అనంత జిల్లాల్లో అధికారులను నిలదీస్తున్న జనం

AP Schools: ప్రభుత్వ పాఠశాలల విలీనంపై ప్రజల ఆగ్రహం- చిత్తూరు, అనంత జిల్లాల్లో అధికారులను నిలదీస్తున్న జనం

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

Breaking News Live Telugu Updates: ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం

Breaking News Live Telugu Updates: ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం

టాప్ స్టోరీస్

జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం

జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు