IPL 2025: ధోనీపై ఉన్నది అభిమానం కాదు ప్రమాదం? సీఎస్కేకు రాయుడు హెచ్చరిక
IPL 2025: ధోనీ ప్రేమికులతో సీఎస్కే ప్రమాదంలో పడుతుందని అంబటిరాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి మానియాలో పడిన ఆ ఫ్రాంఛైజీ ఇంకో కెప్టెన్‌ను చూసుకోలేదని హెచ్చరించాడు.

MS Dhoni Craze Hurt CSK? : ధోనీ మానియా పెరిగిపోతోంది. ఇప్పుడు చెన్నై ఆడి మ్యాచ్‌లకు వస్తున్న వాళ్లంతా ధోనినీ చూడటానికే వస్తున్నారు. బ్యాటింగ్ చేస్తే, కీపింగ్‌లో మ్యాజిక్ చేస్తాడనో ఆశిస్తూ వస్తున్న వాళ్లే ఎక్కువ మంది. ధోని పేరు ఐపీఎల్‌కే పర్యయపదంగా మారిపోతోంది. ఆయన్నో దేవుడిలా చూస్తున్నారు జనం. అందుకే ఆయన్ని తప్పించడానికకి కూడా సీఎస్‌కే ఆలోచిస్తోంది. అందుకే మొన్న రిటైర్మెంట్‌పై కామెంట్ చేసిన ధోని.... తనను చక్రాల కుర్చీలో ఉన్నా అడిస్తారేమో అన్నాడు. ధోని ఫీల్డ్‌లో ఉంటే చాలు ప్రత్యర్థులు ఎంత హడలెత్తిపోతారో తెలియదు కానీ స్టేడియంలు మాత్రం నిండిపోతాయి. టీవీలకు జనం అతుక్కుపోతున్నారు. ఫోన్లలో మునిగిపోతున్నారు.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత వేరే చోట అతని ఆట చూసే అవకాశం కలగడం లేదు. కేవలం ఐపీఎల్ మాత్రం వేదిక అవుతుంది. అందుకే జనం ఇంతలో ధోని కోసం ఎగబడుతున్నారు. ముందు బ్యాట్సమెన్ అవుటైతో బాగుంటుంది ధోనీ క్రీజ్‌లోకి వస్తారని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా పెరిగిపోతున్న ధోనీ మానియా సీఎస్‌కే జట్టుకు మంచిది కాదని CSK మాజీ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ "వింత" వ్యామోహం ఫ్రాంచైజీకి మంచి చేయడం కంటే చెడు ప్రభావం చూపుతుందని అంటున్నాడు. "ఇది చాలా వింతగా ఉంది. ఇది ఆటకు ఉపయోగపడుతుందని నేను అనుకోను. కొత్తవారైతే మరింత భయంకరంగా ఉంటుంది. మద్దతు అసాధారణంగా ఉంటుంది. కానీ, మీరు ఆడుతున్నప్పుడు, వారు CSK అభిమానులుగా మారే ముందు వారు MS ధోని అభిమానులు అని గ్రహిస్తారు. సంవత్సరాలుగా జట్టును అలానే నిర్మించారు," అని రాయుడు ESPNCricinfoతో అన్నాడు.
"అతని తలా అని పిలుస్తున్నారు. CSK కోసం అతను కూడా కష్టపడుతున్నాడు. కానీ ఒక స్టేజ్‌కు వచ్చేసరికి అతనంటే పిచ్చి ఏర్పడుతుంది. దాని కోసం ఏమైనా చేయాలని పిస్తుంది" అని ఆయన అన్నారు.
చాలా మంది అభిమానులు ధోని బ్యాటింగ్ చూడటానికే వస్తుంటారు. అలాంటి వాళ్లు సీఎస్కే టీం బ్యాటర్లు అవుటవుతున్నప్పుుడ ఛీర్స్ చెబుతున్నారు అని రాయుడు ఆందోళన వ్యక్తం చేశాడు. గత వారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది కళ్లకు కట్టినట్టు కనిపించిందన్నాడు. గతంలో కూడా కొందరు ఆటగాళ్లు ఇలాంటి వింత అనుభవాలు చూశారని ఉదహరించాడు.
"ఇలా చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. చాలా మంది ఆటగాళ్ళు దీనిని అనుభవిస్తున్నారు. బహిరంగంగా చెప్పకపోయినా, అంతర్గతంగా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా MS ధోనిని ప్రేమిస్తున్నాం. వారు MS ధోనిని కూడా ప్రేమిస్తున్నారు. అతను బ్యాటింగ్ చేయడాన్ని చూడాలనుకుంటున్నాం. కానీ కొన్నిసార్లు బ్యాటింగ్ చేయడానికి బయలుదేరినప్పుడు ప్రేక్షకుల నుంచి అరుస్తూ ఉంటారు. బయటకు వెళ్లపోమని అడుగుతారు. వారు బయటకు రావాలని కోరుకుంటారు." అని రాయుడు అన్నారు.
ఇలా అయితే సీఎస్కే జట్టు కచ్చితంగా మంచి కెప్టెన్ లేని జట్టుగా భవిష్యత్‌లో మారుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు రాయుడు. దానికి ఫ్రాంచైజీ సిద్ధంగా ఉండాలని సూచించారు.
"దీనిని పరిష్కరించగల ఉత్తమ వ్యక్తి MS ధోని. అతను బయటకు వచ్చి, 'వారందరూ మా ఆటగాళ్లు, నాలాగే వారు బ్యాటింగ్ చేస్తున్నారు' అని చెబితే, లేదా ప్రేక్షకులను శాంతింపజేయడానికి అలాంటిదేదైనా చేస్తే ఆటగాళ్లకు మంచి జరుగుతుంది" అని రాయుడు చెప్పాడు.
"ఇది ఆటగాళ్లకే చెన్నై ఫ్రాంచైజీకి చాలాసవాలే. ఈ మ్యాచ్‌లకు స్టాండ్‌లు ఫుల్ అవుతున్నాయి. అతను మంచి ఆటగాడే. అయితే జనాలను ఆకర్షించే పనిలో పడి ఫ్రాంచైజీలో వేరే వ్యక్తిని తయారు చేయలేదు. ఎప్పుడూ MS ధోని చుట్టూ తిరుగుతున్నారు. బ్రాండింగ్‌పరంగా, జనాలను ఆకర్షించడంలో మంచిదే కావచ్చు. కానీ ఇది వారికే ప్రమాదం. కాబట్టి వారు అవుటాఫ్‌ది బాక్స్ ఆలోచించాల్సి సమయం వచ్చింది. " అని రాయుడు చెప్పుకొచ్చాడు.




















