అన్వేషించండి

Folk Festival Teej: బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ, 11 రోజులపాటు ఘనంగా వేడుకలు

Folk Festival of Banjaras | కాలం మారుతున్నా తమ సంస్కృతి, సాంప్రదాయాలను బంజారాలు కొనసాగిస్తున్నారు. అనంతపురంలో బంజారాలు జరుపుకునే తీజ్ పండుగకు మూడు రాష్ట్రాల నుంచి తరలివస్తారు.

Teej A Folk Festival | అనంతపురం: సింధు నాగరికత నుంచి సనాతన సంస్కృతి సాంప్రదాయాలను.. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు బంజారాలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ తరహాలో గిరిజన తండాలో పల్లెదనం ఉట్టిపడేలా పూర్వీకుల నుంచి వస్తున్న తమ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బంజారాలు హర్యాలీ తీజ్ పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బంజారా కళలను కనుమరుగు కాకుండా వాటికి జీవం పోస్తూ నేటికీ వారి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉన్నారు. రాను రానూ మారుతున్న కాలానుగుణంగా బంజారాల తీజ్ పండుగను అక్కడక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండాలో ఈ ఉత్సవాలను 11 రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. 

పెళ్లికాని యువతుల పండుగ తీజ్ : 
విశిష్ట చరిత్ర కలిగిన తీజ్ ఉత్సవాలను కన్యలు పండుగ జరపాలని గ్రామ పెద్ద ఇంటికి వెళతారు. గ్రామపెద్ద కుల గోత్రం వారిని సమావేశపరిచి తీజ్ పండుగ జరపాలని అందరి అభిప్రాయాలు సేకరించి చివరికి నిర్ణయం తీసుకుంటారు. ఈ పండుగ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాసాలలో నిర్వహించుకుంటారు. పూర్వం నుంచి కీర్తనల ఆధారంగా పండుగ శ్రావణ, భాద్రపద మాసాలలో నిర్వహించాలని పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ పండుగ జరపడం వల్ల గోధుమ మొక్కలు గంప (బుట్ట)లో ఏ రకంగా అయితే పచ్చగా మొలకెత్తి పెరుగుతాయో  అలా బంజారాల గ్రామలు, సమాజం, పంట పొలాలు, జీవజాతులు అన్ని కూడా సస్యశ్యామలంగా ఉండాలన్న ఆలోచనతో పండుగ నిర్వహిస్తారు.


Folk Festival Teej: బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ, 11 రోజులపాటు ఘనంగా వేడుకలు

ఈ పండుగ తలపెట్టే బంజారా యువతులు (పెళ్లి కాని యువతులు )  11 రోజులపాటు వ్రతము అనుసరిస్తూ ఆహార నియమాలను పాటించి భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి కుటుంబాలు బాగుండాలని నవతరానికి బీజం లాంటిది తీజ్ పండుగని బంజారా నేతలు పేర్కొన్నారు. గంపలలో మొలకెత్తిన గోధుమ మొక్కలను తుల్జా భవాని సామా సంగ్ మహారాజ్ లను పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి గంపలో పెరిగిన తీజ్ మొక్కలను బంజారా నేతలకు తమ తలపాగలు ఉంచుతారు. ఈ మొక్కలను బంజారా లు భక్తిశ్రద్ధలతో తమ ఇండ్లలో భద్రపరచుకుంటారు. ఆ మొక్కలు ఎవరింట్లో అయితే ఉంటదో వారింట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని బంజారాల విశ్వాసం. ఉత్సవాల ఆఖరి రోజు గోధుమ మొక్కలు ఉన్న గంపలను శోభాయాత్రగా ప్రదర్శన నిర్వహించి గ్రామ నాయక్ బావిలో నిమజ్జనం చేస్తారు. అనంతరం బంజారా కన్యల సోదరులు తెచ్చిన తిను బండారాలు గుగ్గులను ఒకచోట చేరి ఆరగిస్తారు. ఇంతటితో ఈ పండుగ ముగిస్తుంది.

 బంజారాలకు అతిపెద్ద పండుగ : 

 తీజ్ పండుగ తిలకించడానికి రూపా నాయక్ తండాకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి బంజారాలు వచ్చి పండుగలు పాల్గొంటారు. రూపా నాయక్ తండాలోని నాయక్ డావో కార్ భారీ చౌహాన్ రాథోడ్ పమార్ జాదవ్ గోత్రాల వారు సమిష్టిగా పాల్గొని పండుగను జరుపుతారు. రూపా నాయక్ తండాకు అనుబంధంగా ఉన్న కలగల తండా, జేరుట్ల రాంపురం తండా, వెంకటం పల్లి చిన్న తండా, పందికుంట తండా బంజారా లు  అధికంగా పాల్గొంటున్నారు. 

Folk Festival Teej: బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ, 11 రోజులపాటు ఘనంగా వేడుకలు

 బంజారాల ఐక్యతకు నిదర్శనం తీజ్ పండుగ

ఐక్యత, ఆదర్శానికీ, సంస్కృతికి నిదర్శనం బంజారాల తీజ్ ఉత్సవాలు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ సంస్కృతి సాంప్రదాయాలతో బంజారాల తీజ్ ఉత్సవాలని నిర్వహిస్తారు. 11 రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడే తీజ్ ఉత్సవాలు ప్రారంభోత్సవం అయింది. ఈ సందర్భంగా రూపా నాయక్ తండా తో పాటు జెరుట్ల రాంపురం, వెంకటం పల్లి చిన్న తండా, పందికుంట తండా, కలగళ్ల తండా వాసులు పాల్గొంటూ ఆ వివాహిత బంజారా కన్యలు తమ వేషాధారణ ధరించి సాంప్రదాయ పద్ధతిలో సాయంత్రం గోధుమలు తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. అనంతరం వెదురు బుట్టలు, ఎర్రటి పుట్టమన్ను, ఇసుకను గంపలలో గోధుమ మొక్కలను పెంచి వాటి చుట్టూ వివిధ పుష్పాలతో బతుకమ్మ తరహాలో అలంకరించి దేవుడి వద్దకు తీసుకువస్తారు.


Folk Festival Teej: బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ, 11 రోజులపాటు ఘనంగా వేడుకలు

పెళ్లి కాని బంజారా యువతులు నియమ నిష్టలతో అత్యంత భక్తి ప్రపత్తులతో అనుసరించాల్సిన నియమాలను తెలియజేస్తారు. బంజారా సాంప్రదాయ రీతిలో తీజ్ ఉత్సవాల పాటలను పాడుతూ నృత్యాలను చేస్తూ రాత్రంతా వివిధ విన్యాసాలతో తండాలో సందడి నెలకొంటుంది. ఈ ఉత్సవాలలో ఉన్నత చదువులు చదువుకున్న బాలికలు సైతం తమ సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సైతం తమ తమ తండాలకు కుటుంబ సమేతంగా చేరుకుంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: బంధువులు- బద్ద శత్రువులు -ఆత్మీయులు, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటున్న దగ్గుబాటి
బంధువులు- బద్ద శత్రువులు -ఆత్మీయులు, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటున్న దగ్గుబాటి
Cadaver Dogs: SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: బంధువులు- బద్ద శత్రువులు -ఆత్మీయులు, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటున్న దగ్గుబాటి
బంధువులు- బద్ద శత్రువులు -ఆత్మీయులు, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటున్న దగ్గుబాటి
Cadaver Dogs: SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
Janhvi Kapoor:  జాన్వీ కపూర్ బర్త్ డే గిఫ్ట్ - రామ్ చరణ్ 'RC16' నుంచి పోస్టర్ రిలీజ్, లుక్ అదిరిందిగా..
జాన్వీ కపూర్ బర్త్ డే గిఫ్ట్ - రామ్ చరణ్ 'RC16' నుంచి పోస్టర్ రిలీజ్, లుక్ అదిరిందిగా..
Patanjali Foods: పతంజలి ఫుడ్స్‌ మెగా బిజినెస్‌ ప్లాన్‌ - నాగ్‌పుర్‌లో రూ.2100 కోట్లతో 'పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్‌ పార్క్‌'
పతంజలి ఫుడ్స్‌ మెగా బిజినెస్‌ ప్లాన్‌ - నాగ్‌పుర్‌లో రూ.2100 కోట్లతో 'పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్‌ పార్క్‌'
Trump Tariffs: భారత్‌పై ప్రతీకార సుంకాలు - అసలు ప్రతీకార సుంకం అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో దీనిని విధిస్తారు?
భారత్‌పై ప్రతీకార సుంకాలు - అసలు ప్రతీకార సుంకం అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో దీనిని విధిస్తారు?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.