![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
YS Jagan: జగన్‌పైకి అతను ఎందుకు దూసుకొచ్చాడు? దాడి చేయడానికా? అసలు నిజం చెప్పిన వ్యక్తి
Andhrapradesh News: మాజీ సీఎం వైఎస్ జగన్ కడప పర్యటనలో భాగంగా శనివారం ఊహించని ఘటన జరిగింది. ఆయనపై ఓ వ్యక్తి దూసుకురాగా భద్రతా సిబ్బంది అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు.
![YS Jagan: జగన్‌పైకి అతను ఎందుకు దూసుకొచ్చాడు? దాడి చేయడానికా? అసలు నిజం చెప్పిన వ్యక్తి a person who rushes to the former cm ys jagan in ysr district tour latest news YS Jagan: జగన్‌పైకి అతను ఎందుకు దూసుకొచ్చాడు? దాడి చేయడానికా? అసలు నిజం చెప్పిన వ్యక్తి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/67761672fa059290f1dbb867b3a511701720330246965876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
A Man Rushed To YS Jagan In Ysr District Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) వైఎస్ఆర్ జిల్లా పర్యటన సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం కడప (Kadapa) రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా జగన్ మీదకు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. అయితే, తాను జగన్‌పై దాడి చేసేందుకు రాలేదని.. ఆయనతో సెల్ఫీ దిగేందుకు వచ్చానని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనతో ఒక్కసారిగా నేతలు ఆందోళనకు గురయ్యారు.
పులివెందులలో జగన్
జగన్ ఆదివారం పులివెందులలో పర్యటిస్తున్నారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజాదర్బార్ నిర్వహించనున్న క్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆయన్ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కలిశారు. పర్యటనలో భాగంగా జగన్ లింగాల మండలం పెద్దకూడాలలో వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సోమవారం దివంగత వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొననున్నారు.
Also Read: Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)