By: M Seshu | Updated at : 24 Dec 2022 08:03 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
మూషిక జింకలు
అచ్చం జింకను పోలిన ఒంటి తీరు.. ఎత్తు చూస్తే ఎలుక కంటే కాస్త ఎత్తు ఎక్కువగా ఉంటే ఈ అరుదైన జంతువులే మూషిక జింకలు. ప్రపంచంలోనే అతి చిన్న జింకలుగా వీటిని పిలుస్తుంటారు. చంగు చంగుమంటూ జింకలా అటు నుండి ఇటు..ఇటు నుండి అటు ఎలా దూకండం చూస్తుంటే జింక లక్షం.ముఖాన్ని పరీక్షించి చూస్తే ఎలుకను పోలినట్లు ఉండటం ఈ జింకకు ప్రత్యేక లక్షణం. చక్కగా చూడముచ్చటగా ఉన్న ఈ అరుదైన జింక జాతి అడవులు విస్తీర్ణంగా ఉన్నప్పుడు భారీ సంఖ్యలో ఉండేవి. కాలక్రమంలో అడువులు కోతకు గురికావడం, చెట్లను నరికేస్తుండంతో అడవుల విస్తీర్ణం తగ్గడంతోపాటు అందులో నివసించే నక్కలు,తోడేళ్లు వంటి క్రూరమృగాలు ఈ అతిచిన్న జింకలను వేటాడి తియేడంతో నెమ్మదిగా వీటి సంఖ్య తగ్గిపోయింది.ఎంతలా అంటే 2010 సంవత్సరంలో అయితే అడవుల్లో అక్కడక్కడ ఒకటి ,రెండు మాత్రమే కనిపించే పరిస్దితి ఏర్పడింది. దీంతో అంతరించిపోతున్న మూషిక జింకలను సంరక్షించాల్సిన అవసరం ఏర్పడింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం మూషిక జింక జాతిని ఉత్పత్తి పెంచేందుకు బ్రీడింక్ కేంద్రాన్ని దేశంలోనే మొదటిసారి నెహ్రూ జూపార్క్ లో 2010వ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. . ఈ మౌస్ డీర్ బ్రీడింగ్ కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడకు రెండు మగ, నాలుగు ఆడ మూషిక జింకలను మాత్రమే సేకరించి ఈ కేంద్రంలో బ్రీడింగ్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అలా కేవలం ఆరు మూషిక జింకలతో మొదలైన ఈ బ్రీడింగ్ కేంద్రం ఏకంగా ఇప్పటి వరకూ నాలుగు వందల మూషిక జింకలను బ్రీడింగ్ పద్దతిలో ఉత్పత్తి చేసి ,పెంచి ,తెలంగాణాలోని వివిధ అడవుల్లో 220 మూషిక జింకలను వదిలిపెట్టే స్దాయికి నేడు చేరింది.
ఎతైన సాధారణ జింకలకు ,మూషిక జింకలకు చాలా వ్యత్యాసం ఉంది.ఈ అతి చిన్న జింకలలో ఎలుకను పోలిన ఆకారం ఉన్నప్పటికీ శారీర నిర్మాణంలో మాత్రం ఎత్తుతక్కూవైనా జింకమాదిరి దేహదారుడ్యం కనిపిస్తుంది.ఒంటిపై రంగులు అచ్చం జింకపై ఉన్న చారలుగా కనిపిస్తాయి.ఐదు కిలోలకు పైగా బరువుండే ఈ మూషిక జింకల జీవిత కాలం ఆరు నుండి ఏడు సంవత్సరాలు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు.రాత్రి సమయంలో ఎక్కవ సంచరించే వీటిని ఉత్పత్తి పెంచడం అంటే సామాన్య విషయంకాదు.అందుకే జ్యూఅధికారులు వీటిపట్ల ప్రత్యేక శ్రద్ద చూపించడంతోపాటు ఇచ్చే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రీన్ గ్రాస్, పాలక్, వివిధ రకాల పండ్లు ముక్కలుగా చేసి వీటికి ఆహారంగా అందిస్తుంటారు. రెండు మగ మూషిక జింకలను ఒకే చోట ఉంచితే ఒకదానిపై మరొకటి బలంగా దాడులు చేసుకోవడం వీటి నైజం కావడంతో ఇలా గదులుగా విభజించి ,మగ జింక తోడుగా ఆడ జింకలను ఉంచుతారు. బ్రీడింగ్ విషయంలో వీటికి ఓ అసాధారణ,ప్రత్యేకత లక్షణం ఉంది.సహజంగా జింకలు యుక్తవయస్సు రాగానే బ్రీడింగ్ కు సిద్దంగా ఉంటాయి.కానీ మూషిక జింకలు మాత్రం కన్న వెంటనే శృంగారం చేసేందుకు సిద్దంగా ఉంటాయని జ్యూ వైద్యనిపుణులు చెబుతున్నారు. కేవలం ఈ సమయంలో మాత్రమే ఇవి బ్రీడింగ్ కు అనుకూలంగా ఉంటాయట. అందుకే కన్న వెంటనే వీటిని మరోసారి బ్రీడింగ్ ప్రక్రియ జరిపేందుకు తగిన ఏర్పాటు చేస్తారు. ఇతర జంతువులతో అయితే ప్రసవం అయిన ఏడాది లేక రెండేళ్లు సమయం తర్వాత మరో గర్భం దాల్చేందుకు సద్దంగా ఉంటాయి. కానీ మూషిక జింకలు మాత్రం పూర్తిగా విభిన్నం.
మేనరికం వీటికి కూడా వర్తిస్తుంది.అందుకే క్రాస్ బ్రీడింగ్ చేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మూషిక జింకలను ఉత్పత్తి చేస్తున్నారిక్కడ. ఇలా పెరిగిన జింకలను దేశవ్యాప్తంగా అనేక అడువుల్లో వదులుతూ వీటి జాతిని పెంచేప్రయత్నం చేస్తున్నారు. ఇలా బ్రీడింగ్ విధానంలో పుట్టిన మూషిక జింకలను మూడు విధాలుగా పరీక్షించిన తరువాత అంటే మొదటి పదిహేను రోజులు మూడు జోన్ లుగా విభజించి ,నీటి లభ్యత ఉన్న అటవీ ప్రాంతాల్లో వీదిలిపెడతారు. బ్రీడింగ్ విధానం ద్వారా ఉత్పత్తి చేసిన ఈ మూషిక జింకలు, అటవీప్రాంతలో బ్రతకగలవని భావించిన తరువాత మాత్రమే వాటిని దట్టమైన అడువుల్లో నీటి లభ్యత గల ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారు జ్యూ అధికారులు. ఇలా కేంద్ర సహకారంతో ఈ అరుదైన జింక జాతికి తిరిగి పూర్వవైభవం తీసుకొస్తున్నారు నెహ్రూ జూపార్క్ అధికారులు.
Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల
RRB Group D Result: రైల్వే 'గ్రూప్-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
గ్రీన్ హైదరాబాద్ దిశగా కీలక అడుగులు - GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలివే!
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!
Ugadi 2023: ఉగాది అంటే అందరికీ పచ్చడి, పంచాంగం: వాళ్లకు మాత్రం అలా కాదు!