ABP South Rising Summit 2024: ప్రపంచంలో భద్రత లేని ఉద్యోగం "నటన"- ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాను: రాశీ ఖన్నా
ABP South Rising Summit 2024: సురక్షితమైన ఉద్యోగం, విధి రాత, తల్లిదండ్రుల మద్దతు ఇలాంటి చాలా అంశాలపై నటి రాశీ ఖన్నా తన ఆలోచనలను సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పంచుకున్నారు.
ABP South Rising Summit 2024: రాశి ఖన్నా IAS అధికారి కావాలనే కోరిక నుంచి విజయవంతమైన నటిగా ఎలా మారారో ABP నెట్‌వర్క్ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పంచుకున్నారు. విధి రాత, జీవితంలో ఛాయిస్ గురించి ఎంపికలపై అభిప్రాయాలు తెలియజేశారు.
"ఫేట్ ఇష్టపడేవారిని ముందుగు నడిపిస్తుంది. ఇష్టపడని వారిని లాగుతుంది" అనే కోట్‌తో ఆమె స్పీచ్ స్టార్ట్ చేశారు. జీవితంలో వచ్చే సర్ప్రైజెస్‌ను అంగీకరిస్తానని చెప్పింది.
"నేను విధి రాతకు తలవంచుతాను. నేను ఎప్పుడూ అంతే. నేను జీవితంలో అనుకున్నది దక్కలేదు. కోరుకున్నదేదీ జరగలేదు. నేను IAS అధికారిని కావాలనుకున్నాను అది జరగలేదు. మీరు మధ్యతరగతి కుటుంబంలో పెరుగుతున్నప్పుడు, సురక్షితమైన ఉద్యోగాన్ని కోరుకుంటారు.
“నేను ఐఎఎస్ అధికారిని కావాలనేది మా నాన్న కల. సురక్షితమైన ఉద్యోగమే కదా నేను ఎందుకు చేయలేను? అనుకునే దాన్ని. నేను సబ్జెక్ట్‌లో చాలా టాపర్, కాబట్టి అనుకున్న లక్ష్యంలో విజయం సాధిస్తాను అనుకున్నాను. కానీ, దేవుడు పూర్తిగా భిన్నమైన ప్లాన్‌తో ఉన్నాడని తర్వాత తెలిసింది. ఆ ప్లాన్ ప్రకారమే ఇలా నేను నటిగా మారాను.
తల్లిదండ్రులే తనకు బిగ్ సపోర్ట్ అని చెప్పారు రాశీ ఖన్నా, "జా జీ లే అప్నీ జిందగీ' అని చెప్పింది.
నటిగా మారడానికి ఉన్న కష్టాలను రాశీ ఖన్నా వివరించింది. “ఇది నాకు చాలా సులభమే. కానీ నటులుగా మారడం చాలా కష్టం. ఇది ప్రపంచంలోనే అత్యంత భద్రత లేని ఉద్యోగం, ఎందుకంటే మీకు మరో సినిమా ఉంటుందో లేదో మీకు తెలియదు. మీకు ఆఫర్ రావాలంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి వేచి ఉండవలసి ఉంటుంది. కానీ నేను చాలా అదృష్టవంతురాలిని. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాను.”
"నాకు పని చేయడం చాలా ఇష్టం. నాకు మంచి చిత్రాలు ఇచ్చినందుకు పరిశ్రమలోని అందరికీ ధన్యవాదాలు."
రాశి ఖన్నా న్యూఢిల్లీలోని పశ్చిమ్ విహార్ నుంచి వచ్చారు. ఆమె లేడీ శ్రీ రామ్ కాలేజీలో బోర్డు పరీక్షలలో 91%తో ఉత్తీర్ణత సాధించారు. ఆమె తెలివైన చలాకీగా ఉండే విద్యార్థి.
సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి