ABP Southern Rising Summit 2024 Live Updates: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు - సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ABP Southern Rising Summit 2024: ఏబీపీ నెట్‌వర్క్ 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్'కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గొంటున్నారు.
LIVE
Background
ABP Southern Rising Summit 2024 Live Updates: దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నిర్వహిస్తోన్న ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశ ప్రగతిలో దక్షిణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్ సదరన్ రైజింగ్ సదస్సు హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో దక్షిణాది రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. Coming of Age: Identity, Inspiration, Impact”, అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు దక్షిణాది ప్రత్యేకతను నిలబెట్టుకునే అంశంపై ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు దేశ అభివృద్ధి, ప్రగతిలో దక్షిణ భారత ప్రాధాన్యతను అందులో ఈ వ్యక్తుల పాత్రను ఆవిష్కరిస్తుంది. "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" జాతీయ కోణంలో దక్షిణాది ప్రాధాన్యతను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించనుంది. అలాగే ఆయా రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాల్సిన అంశాల ప్రముఖులు తమ ఆలోచనలు పంచుకుంటారు.
సదస్సులో పాల్గొనే ప్రముఖులు వీరే
సౌతిండియా నుంచి అగ్రశ్రేణి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, రచయతలు, వ్యాపారులు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించి తన విజన్‌ను ఆవిష్కరిస్తారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. ఇండియన్ బాడ్మింటన్ దిగ్గజం, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, స్టార్ హీరో సాయి దుర్గా తేజ్, నటి రాశీఖన్నా, జాతీయ నటుడు ప్రకాష్ రాజ్, మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు, రచయిత చిదంబరం, వెటరన్ యాక్టర్ గౌతమి వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు.
అటు, పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. రాజకీయ రంగంలో దక్షిణాది నుంచి తమదైన ముద్ర వేసిన యువనేతలు సదస్సుకు హాజరవుతున్నారు. బీజేపీ నేత కొంపెల్ల మాధవి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిది డాక్టర్ షామా మహమ్మద్, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మధుయాష్కీ గౌడ్, బీజేపీ ఎంపీ రఘునందన్ వంటి వారు కూడా దక్షిణాది రాజకీయ రంగం భవిష్యత్‌లో దేశంలో పోషించబోతున్న పాత్రపై తమ విశ్లేషణను అందిస్తారు. అలాగే సాంస్కృతిక రంగం నుంచి క్లాసికల్ సింగర్ బిందు సుబ్రహ్మణ్యం, అవార్డు విన్నింగ్ సింగల్ శిల్పారావు, క్లాసికల్ డ్యాన్సర్, మూడుసార్లు జాతీయ అవార్డు పొందిన యామినిరెడ్డి దక్షిణాది కల్చర్ హెరిటేజ్‌ను హైలెట్ చేస్తారు. అదే సమయంలో దక్షిణాది భవిష్యత్‌లో ఎలా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందో రచయిత, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ చర్చిస్తారు. అలాగే, స్టార్టప్‌ల్లో తనదైన ముద్ర వేసిన రాపిడో కో ఫౌండర్ అరవింద్ సంకా.. యువత మరింత వేగంగా వ్యాపార రంగంలో రాణించడానికి ఎలాంటి పాలసీలు అవసరమో... ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చో అన్న అంశాలపై తన అభిప్రాయాలు పంచుకుంటారు.
అన్ని రంగాల్లోనూ దక్షిణాది పాత్రను చాటేలా 'సదరన్ రైజింగ్ సమ్మిట్' జరగనుంది. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రను సెలబ్రేట్ చేసుకునేలా ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఐఏఎస్ కావాలని ఉండేది - నటి రాశీ ఖన్నా
ABP Southern Rising Summit 2024: కాలేజీలో ఉన్నప్పుడు తనకు ఐఏఎస్ కావాలనే కోరిక ఉండేదని నటి రాశీ ఖన్నా వెల్లడించారు. ఆమె 12వ తరగతిలో 91 శాతం ఉత్తీర్ణత సాధించి, లేడీ శ్రీరాం కాలేజీలో బ్యాచిలర్స్ చదివారు. తన స్నేహితురాలితో కలిసి ముంబై వెళ్లి మద్రాస్ కేఫ్ కోసం ఆడిషన్‌కు వచ్చినప్పుడు యాధృచ్ఛికంగా నటి అయ్యానని ఆమె ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో చెప్పారు.
గుజరాత్ అల్లర్ల ఆధారంగా 'ద సబర్మతి రిపోర్ట్' - నటి రాశీ ఖన్నా
ABP Southern Rising Summit 2024: ప్రముఖ నటి రాశిఖన్నా ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రాబోయే చిత్ర 'ది సబర్మతి రిపోర్ట్' గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇది 2002 గుజరాత్ అల్లర్ల ఆధారంగా రూపొందించబడింది.
ఒకే రోజు 20 సెషన్లు.. ఇది ఎంతో గొప్ప విషయం - ఏబీపీ దేశం ఎడిటర్ నాగేశ్వరరావు
ABP Southern Rising Summit 2024: ఇది ఎంత గొప్ప రోజని.. ఉదయం నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, గొప్ప నటుల డిబేట్స్ విజయవంతంగా జరిగాయని ఏబీపీ దేశం ఎడిటర్ నాగేశ్వరరావు చెప్పారు. 'ఒకే రోజు 20 కంటే ఎక్కువ సెషన్లను చూశాం. ఇది గొప్ప రోజు. గొప్ప వక్తలు, ప్యానెలిస్ట్‌ల నుంచి అనుభవాలు ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసిన స్పీకర్లు, ప్లానెలిస్ట్లు మరియు ప్రతినిధులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' అని పేర్కొన్నారు.
నా పొలాలు ప్రకృతితో స్నేహాన్ని ప్రతిబింబిస్తాయి - ప్రకాష్ రాజ్
ABP Southern Rising Summit 2024: నాసిరకంగా ఉన్న పొలాలను కొనుగోలు చేసి వాటి పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేశానని నటుడు ప్రకాష్ రాజ్ చెప్పారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన వ్యవసాయంపై తనకున్న ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నగరాల్లో తనకు సొంత ఇళ్లు లేవని.. తన పొలాలన్నీ ప్రకృతితో తన స్నేహాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు.
నన్ను నమ్మిన వారి గొంతుకగా నిలబడతా - నటుడు ప్రకాష్ రాజ్
ABP Southern Rising Summit 2024: తనను నమ్మిన వారి గొంతుకగా నిలబడడం తన బాధ్యత అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను కోల్పోవడం గురించి పంచుకున్నారు. 'నా స్నేహితురాలు గౌరీ లంకేష్ గొంతు పెంచినందుకే ఆమెను కాల్చిచంపారు.' అని అన్నారు.