అన్వేషించండి

Honor Killing In Hyderabad: ఇబ్రహీంపట్నంలో పరువు హత్య- వద్దన్నా ప్రియుడితో మాట్లాడుతోందని హత్య చేసిన తల్లి

Hyderabad Crime News: ప్రేమ వద్దు చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని చెప్పిన మాట వినలేదని కుమార్తెను చంపేసిందో తల్లి.

Telangana Crime News: హైదరాబాద్‌లోని ఇబ్రహీం పట్నం(Ibrahimpatnam)లో దారుణం జరిగింది. తను వద్దన్నప్పటికీ ప్రియుడితో మాట్లాడుతోందని కన్నకుమార్తెనే ఓ తల్లి చంపేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలోని దండుమైలారం(Dandumailaram)లో ఈ దుర్ఘటన జరిగింది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... మోతే జంగమ్మ, ఐలయ్యకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె పేరు భార్గవి. వయసు ఇరవై ఏళ్లు. ప్రస్తుతం ఆమె దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమె స్వగ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. 

ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే వేరే వ్యక్తితో పెళ్లి ఏర్పాట్లు చేశారు. బంధువుల అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. అదే టైంలో భార్గవని కాలేజీకి కూడా పంపించడం మానేశారు. రెండు వారాల నుంచి హౌస్‌ అరెస్టు లాంటిదే చేశారు. 

ప్రేమ ఆమెను ఇంట్లో ఉండనీయలేదు. రెండు వారాలుగా ప్రేమికులు కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. దీంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన భార్గవి... ప్రియుడికి కబురు పెట్టింది. ఎవరూ లేని చోట వీళ్లిద్దరు మాట్లాడుతున్న విషయాన్ని తల్లి జంగమ్మ గమనించింది. 

దీనిపై సోమవారమంతా గొడవ జరిగింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా భార్గవి మాట వినకపోవడంతో దారుణానికి ఒడిగట్టింది తల్లి జంగమ్మ. కుమార్తెకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించింది. అయితే ఈ విషయాన్ని చరణ్ అనే యువకుడు చూశారు. 

ఇదే విషయాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులకు పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరన్సిక్‌ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపించారు. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Group 2 Exam: అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Phone Number:చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
Son Murder Father: వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Group 2 Exam: అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Phone Number:చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
Son Murder Father: వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
Vijayawada News: ఎంతకు తెగించార్రా? - బయట యూట్యూబ్ చానల్ బోర్డు లోపల కసామిసా యాపారమా?
ఎంతకు తెగించార్రా? - బయట యూట్యూబ్ చానల్ బోర్డు లోపల కసామిసా యాపారమా?
Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
Actor Prudhvi Raj: వేసవిలో 11 సార్లు నీళ్లు తాగండి- పృథ్వీ ఆరోగ్య సలహాలు!
వేసవిలో 11 సార్లు నీళ్లు తాగండి- పృథ్వీ ఆరోగ్య సలహాలు!
Embed widget