WFI Suspension: భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్
Wrestling Federation of India: భారత రెజ్లింగ్ సమాఖ్యపై భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (United World Wrestling) కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కి భారీ ఊరట లభించింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (United World Wrestling) కీలక నిర్ణయం తీసుకుంది. WFIపై నిషేధం ఎత్తివేత నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంగళవారం (ఫిబ్రవరి 13న) రాత్రి ప్రకటించింది. అప్పటి డబ్ల్యూఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు వేధింపులు, అత్యాచార ఆరోపణలతో ఆందోళన బాట పట్టడంతో నిర్ణీత గడువులోపు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. దాంతో భారత రెజ్లింగ్ సమాఖ్యను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ గత ఏడాది సస్పెండ్ చేయడం తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐలో అంతర్గతంగా విభేదాలు, బ్రిజ్ భూషన్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన రెజ్లింగ్ నుంచే తప్పుకుంటూ రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే.
The United World Wrestling has lifted the suspension on the Wrestling Federation of India with immediate effect.
— ANI (@ANI) February 13, 2024
గతేడాది ఆగస్టులో WFI సస్పెన్షన్..
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) మరోసారి షాకిచ్చింది! గత ఏడాది ఆగస్టులో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేసింది వరల్డ్ రెజ్లింగ్. సరైన సమయంలో సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.
కొన్ని నెలలుగా భారత రెజ్లింగ్ సమాఖ్యను వేర్వేరు వివాదాలు వెంటాడుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం 2023 జూన్‌లోనే ఎన్నికలు జరగాల్సింది. కొందరు మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగడం, వారికి పురుష రెజ్లర్లు మద్దతు తెలపడం.. రాష్ట్ర సంఘాలు లీగలు పిటిషన్లు దాఖలు చేయడంతో వాయిదా పడ్డాయి. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య భారత్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం వల్ల రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెజ్లర్లు జాతీయ పతాకం కింద ఆడలేరు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఒలింపిక్ అర్హతకు ఎంతో కీలకం. ఇలాంటి కీలక టోర్నీలో రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా బరిలోకి దిగాల్సి వస్తుంది. సెప్టెంబర్ 16 నుంచి పోటీలు మొదలవుతాయి. ప్రస్తుతం భారత రెజ్లింగ్ సమాఖ్యను భూపిందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ సమాఖ్యను నడిపిస్తోంది. 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. దాంతో సభ్యత్వంపై వేటు పడింది.
మొత్తం 15 పదవులకు ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం బయటకు వెళ్తున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ సైతం ఇందులో ఉన్నారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. చండీగఢ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌కు చెందిన దర్శన్ లాల్ సెక్రటరీ పదవికి నామినేట్ అయ్యారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఎస్పీ దేస్వాల్ ట్రెజరర్ పదవికి నామినేట్ అయ్యారు. ఆయన బ్రిజ్ భూషణ్ క్యాంప్ అభ్యర్థే. భారత రెజ్లింగ్ సమాఖ్య సస్పెండ్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. జనవరిలోనే నిషేధం విధించింది. రెజ్లర్లు ఆందోళనకు దిగడంతో మే నెలలో వేటు వేసింది.