అన్వేషించండి
Advertisement
Kavya Maran Net Worth: ఐపీఎల్ వేలంలో కావ్య పాప స్పెషల్ అట్రాక్షన్ - ఆమెకు ఉన్న ఆస్తులు ఎంతో తెలుసా?
Kalanithi Maran Net Worth In Rupees: ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించింది. మహ్మద్ షమి , హర్షల్ పటేల్ లను చౌకగా సొంతం చేసుకుని బౌలింగ్ లైనప్‌ను పటిష్టంగా మార్చుకుంది.
ipl auction 2025: ఇండియా ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో అందరి దృష్టిని మరోసారి ఆకర్షించి... క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించింది కావ్య(Kavya Maran) పాప. ఐపీఎల్ వేలం ఎప్పుడు వచ్చినా ఆటగాళ్ల పేరు ఎంతలా వినపడుతుందో.. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఓనర్ కావ్య మారన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. సన్ రైజర్స్ అభిమానులు ముద్దుగా కావ్య పాప అని పిలుచుకునే మారన్.. ఈసారి మెగా వేలంలోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. వ్యూహాత్మకంగా కీలక ఆటగాళ్లను దక్కించుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్ ఎలాగైనా కొనుగోలు చేస్తుందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే బిడ్ వేస్తూ ధరను పెంచింది. అలాగే అర్ష్‌దీప్ సింగ్ కోసం కూడా కావ్య మారన్ ఇలానే దూకుడుగా బిడ్ వేసింది.
అయితే ఇంతకీ కావ్య మారన్ ఎవరు.. ఆమె ఆస్తి ఎంత.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి అన్న విషయాలు మరోసారి వైరల్ గా మారాయి. దుబాయ్‌లోని జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కావ్య మారన్ కోసం చాలా మంది అభిమానులు టీవీలకు అతుక్కు పోయారు. 2018లో సన్‌రైజర్స్ CEOగా బాధ్యతలు చేపట్టిన కావ్య మారన్.. మీడియా, రాజకీయ నేతలు ఉన్న శక్తివంతమైన కుటుంబం నుంచి వచ్చారు.
సన్ గ్రూప్ కావ్య పాపదే..
ఆగస్ట్ 6, 1992న చెన్నైలో జన్మించిన కావ్య... సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. కావ్య తల్లి కావేరీ మారన్ కూడా సోలార్ టీవీ కమ్యూనిటీ CEO. కావ్య మారన్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధికి కూడా బంధువు. కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. అనంతరం MBA చేశారు. కావ్య తన తండ్రితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సహ యజమానిగా ఉన్నారు. 2018 నుంచి ఫ్రాంచైజీ CEOగా విధులు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా IPL వేలంలో కావ్య మారన్ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. కావ్య మారన్ ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అభిమానులు సందడి చేస్తుంటారు. కెమెరాలు కూడా ఆమెను ఎక్కువ చూపేందుకు ఇష్టపడతాయి మరి.
కావ్య మారన్ ఆస్తులు ఎంతంటే
కావ్య మారన్... సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ ఒక్కాగానొక్క కుమార్తె. ఆమె నికర విలువ సుమారు రూ. 409 కోట్లు. ఆమె భారత్ లో యంగెస్ట్ ఇండియా బిజెనెస్ ఉమెన్ గా ఉన్నారు. ఆమె తండ్రితో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువ మొత్తం అయినప్పటికీ, ఆమె చిన్న వయస్సులోనే వ్యాపార చతురతను తన మార్క్ ను చూపారు. IPL మెగా వేలం 2025 నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలోని అబాడి అల్ జోహార్ అరేనాలో జరుగుతుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ పర్స్ లో ప్రస్తుతం 45 కోట్ల రూపాయల ఉన్నాయి. ఇవాళ జరిగే వేలంలో హైదరాబాద్ కీలక ఆటగాళ్లను దక్కించుకుంటుందేమో చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
అమరావతి
హైదరాబాద్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement