అన్వేషించండి
Advertisement
IND vs AFG 2nd T20: సిరీస్ భారత్ కైవసం, దంచేసిన యశస్వి, దూబే
IND vs AFG 2nd T20 Match Highlights: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
అఫ్గానిస్థాన్(Afghanistan )తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా(Team India) మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal), శివమ్ దూబే (Shivam Dube) మెరుపు ఇన్నింగ్స్‌తో రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మరో 26 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్, శివమ్ దూబే అర్థ శతకాలతో భారత్‌కు విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా... అఫ్గాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభం నుంచే అఫ్గాన్ ధాటిగా బ్యాటింగ్ చేసింది. రహ్మతుల్లా గుర్బాజ్.. ఇబ్రహీం జర్దాన్ తొలి వికెట్‌కు 2 ఓవర్లలోనే 20 పరుగులు జోడించారు. కానీ వెనువెంటనే వీరిద్దరూ అవుటయ్యారు. 14 పరుగులు చేసిన గుర్బాన్‌ను రవి బిష్ణోయ్.... పెలిలియన్‌కు పంపాడు. అనంతరం గుల్బదీన్ నయీబ్ అఫ్గాన్‌కు మంచి స్కోరు అందించాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో గుల్బదీన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 57 పరుగులు చేసిన గుల్బదీన్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మహ్మద్ నబీ 14, నజీబుల్లా జర్దాన్ 23, కరీం జనత్ 20, ముజీబుర్ రెహ్మన్ 21 పరుగులతో పర్వాలేదనిపించడంతో అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ కావడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌సింగ్ 3, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఆదిలోనే దిమ్మతిరిగే షాక్
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. తొలి మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే రనౌట్ అయిన రోహిత్... ఈ మ్యాచ్‌లోనూ తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. రోహిత్‌ను ఒక అద్భుత బంతికి ఫజులాక్ ఫరూకీ బౌల్డ్ చేశాడు. తొలి ఓవర్‌లోనే వికెట్ పడడంతో వికెట్ పడడంతో భారత్ లక్ష్యం దిశగా పయనిస్తుందా అన్న ఉత్కంఠ మొదలైంది. కానీ యశస్వి జైస్వాల్, శివమ్ దూబే విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు.
యశస్వి, దూబే విధ్వంసం
రోహిత్ శర్మ వికెట్ పడిన అనంతరం యశస్వి జైస్వాల్ అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో యశస్వి 68 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. 68 పరుగులు చేసిన యశస్విని కరీం జనత్ అవుట్ చేశాడు. 14 నెలల తర్వాత టీ 20ల్లో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఉన్నంతసేపు మంచి టచ్‌లో కనిపించాడు. కేవలం 16 బంతుల్లో అయిదు చూడముచ్చని ఫోర్లతో కింగ్ కోహ్లీ 29 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో కనిపించిన విరాట్ కోహ్లీని...నవీన్ ఉల్ హక్ అవుట్ చేశాడు. దీంతో 62 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శివమ్ దూబే.. యశస్వి జైస్వాల్ అప్గాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఎదురుదాడి చేసిన ఈ జోడి... భారీ షాట్లతో అలరించి లక్ష్యాన్ని తేలిక చేసింది. జితేశ్ శర్మ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. కానీ శివమ్ దూబే చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో దూబే 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దూబే విధ్వంసంతో మ్యాచ్ భారత్ వశమైంది. 173 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion