Sita Rama Kalyanam 2024: సీతారాముల కళ్యాణం జరిగిన అసలు ప్రదేశం ఇదే!
Sri Ram Navami 2024: ఎప్రిల్ 17 శ్రీరామనవమి...వాడవాడలా సీతారాముల కళ్యాణం సందడి మొదలైంది. ప్రధాన ఆలయాల్లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీతారాముల కళ్యాణం జరిగిన అసలు ప్రదేశం ఎక్కడో తెలుసా...
Sita Rama Kalyanam 2024: శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. సీతాదేవి జన్మస్థలం మిథిలానగరం. జనకమహారాజు పాలించిన రాజ్యమే మిథిలానగరం. బీహార్ నుంచి నేపార్ వరకూ మిథిలా రాజ్యం విస్తరించి ఉందంటారు.దీనినే విదేహ రాజ్యం అని పిలిచేవారు...అందుకే సీతాదేవి మరోపేరు వైదేహి. అప్పట్లో జనకమహారాజు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్ లో ఉన్న జనక్ పూర్. ఈ జనక్ పూర్ లోనే యాగం చేసేందుకు భూమి దున్నుతుండగా సీతాదేవి ఉద్భవించింది. ఈ రాజ్యాన్ని విదేహ రాజ్యం అని కూడా పిలిచేవారట. ఆ పేరుమీదే సీతాదేవికి వైదేహి అనే పేరువచ్చింది. అప్పట్లో జనకుడు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్ పూర్ అని ప్రజల నమ్మకం. ఈ జనక్ పూర్ లో భూమిని దున్నుతుండగా సీతమ్మ తల్లి ఉద్భవించిన నగరం, రామయ్యను పెళ్లిచేసుకున్న నగరం కూడా ఇప్పటి జనక్ పూర్...అప్పటి మిథిలా నగరమే.
Also Read: జై శ్రీరామ్ - మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పయండిలా!
జనక్ పూర్ లో ‘నౌ లాఖ్ మందిర్’
సీతాదేవి జన్మించిన ప్రాంతం ఇదేనన్న విషయం కాలక్రమేణా ప్రజలు మర్చిపోయారు. అందుకే ఆ మధ్య సీతాదేవి జన్మస్థలంపై డిస్కషన్స్ జరిగాయి కూడా. సుర్కిశోర్దాస్ అనే సన్యాసికి 1657లో నేపాల్ జనక్ పూర్ లో సీతాదేవి విగ్రహాలు లభించడంతో అక్కడున్న ప్రజలు తమ చరిత్రను తిరిగి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు. ఆ చరిత్రకు చిహ్నంగా 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘జానకీ మందిర్’ పేరుతో ఓ ఆలయాన్ని నిర్మించారు. వేల గజాల విస్తీర్ణంలో, 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో, పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో నిర్మించిన ఈ ఆలయానికి అప్పట్లోనే 9 లక్షల రూపాయలు ఖర్చయిందట. అందుకే ఈ ఆలయానికి ‘నౌ లాఖ్ మందిర్’ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలోనే సీతమ్మ... శివధనస్సుని పూజించిందని చెబుతారు. అందుకే జానకీమందిరం నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు. ఏటా మార్గశిర మాసంలో సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. నౌ లాఖ్ మందిర్ లో సోదరులు, భార్యతో సహా కొలువైన రాముడిని దర్శించుకునేందుకు రెండు కళ్లు చాలవు. శ్రీరామనవమి, దసరా, సంక్రాంతి , వివాహ పంచమి (మార్గశిర శుక్ల పంచమి) సమయంలో భక్తజనం పోటెత్తుతారు.
ఓవరాల్ గా చెప్పాలంటే సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశమే జనక్ పురి. నేపాల్ వెళ్లే హిందువులంతా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఐదేళ్ల క్రితం నేపాల్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. అప్పట్లో ఈ ఆలయం ప్రత్యేకతపై నెటిజన్లు సెర్చ్ చేశారు కూడా...జనక్ పురికి 18 కిలోమీటర్ల దూరంలో ‘ధనుషధామ్’ అనే ప్రాంతం ఉంది. శ్రీరాముడు విరిచిన శివుని ధనుస్సు ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం. అందుకే జనక్ పురికి వెళ్లినవారు ధనుషధామ్ కు కూడా వెళ్లివస్తుంటారు.
Also Read: ఈ తరం పిల్లలకి రామాయణం గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఆలయానికి వెళ్లండి!