Chandra Babu News: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చంద్రబాబు ఫోన్- ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని అభ్యర్థన
Andhra Pradesh News: పింఛన్ల పంపిణీలో సమస్యల్లేకుండా చూడాలని... నేరుగా ఇంటికి వెళ్లి పింఛన్లు అందించే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ మీనాకు చంద్రబాబు రిక్వస్ట్ చేశారు.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పింఛన్ల పంపిణీ వ్యవహారం ఓ ఎన్నికల స్లోగన్‌లా మారిపోయింది. దీనిపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తప్పు మీదంటే మీది అంటూ విమర్సలు చేసుకుంటున్నారు. వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయదన్న ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతోంది.
ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో పింఛన్ల పంపిణీ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇన్నాళ్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇస్తూ ఉండటంతో ఒకే చోటుకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలన్ని నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా మంది వయసు మళ్లిన ప్రజలు ఉన్నారని వారు కదల్లేని పరిస్థితిలో వేరే చోటుకు వెళ్లి పింఛన్లు అందుకోవడం సాధ్యం కాదంటున్నారు.
సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించాలని ఇప్పటికే సీఎస్‌కు లేఖ రాసిన చంద్రబాబు ఇవాళ ఎన్నికల అధికారి ఎంకే మీనాకు ఫోన్ చేశారు. పింఛన్ల పంపిణీలో సమస్యలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు.