Kiran Royal: కిరణ్ రాయల్‌పై ఆరోపణలపై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్, అప్పటివరకూ పార్టీ కార్యక్రమాలకు దూరం
Pawan Kalyan News : తిరుపతి జనసేన ఇన్ ఛార్జి కిరణ్ రాయల్ పై గత కొన్ని రోజులుగా పలు రకాల ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ పై వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది.

Janasena News : తిరుపతి జనసేన ఇన్ ఛార్జి కిరణ్ రాయల్ పై గత కొన్ని రోజులుగా పలు రకాల ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ పై వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. ఈ ఆరోపణలపై క్షుణ్నమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఆదేశాలు జారీ చేసింది. కిరణ్ రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాన్‌ఫ్లిక్ట్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.
అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సూచించినట్లు ఆయన తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు
గతంలో వైఎస్సార్ సీపీ నేత రోజా ఫిర్యాదుతో కేసులు పెట్టి తనను అరెస్టు చేసి ఫోన్లు లాక్కొన్నట్లు కిరణ్ రాయల్ తెలిపారు. ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని చోరీ చేశారని.. ఆ డేటాతో ఇప్పుడు బ్లాక్ మెయిట్ చేస్తున్నారని ఆరోపించారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి భయపడేది లేదని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వైసీపీ దొంగల ముఠా తన పై కక్ష కట్టిందన్నారు. వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తన పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. క్రిమినల్ కిలాడీ లేడీ లక్ష్మితో తనపై నిరాధారణమైన ఆరోపణలు చేయిస్తున్నారని వాపోయారు. కోటి 20లక్షల రూపాయలు తనకు ఇచ్చినట్లు లక్ష్మి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
Also Read : Crime News: రేషన్ కార్డు కావాలా? నీ కూతుర్ని పంపు! తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం
2016సంవత్సరంలో 50లక్షల రూపాయల చీటీలు వేశామన్నారు. చీటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయని స్పష్టం చేశారు. వైసీపీ తన పై ఆడుతున్న చిల్లర రాజకీయమన్నారు. అప్పుల భాదతో మనస్థాపంతో లక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లక్ష్మిపై గతంలో ఎన్నో కేసులున్నాయని కిరణ్ రాయల్ అన్నారు. లక్ష్మిపై ఆరు కేసులున్నాయి.. భూమన అభినయరెడ్డి తన పై చిల్లర రాజకీయాలు చేయిస్తున్నాడని ఆరోపించారు. భూమన అభినయరెడ్డి లక్ష్మిని రెచ్చగొట్టి తనపై పనికిమాలిన ఆరోపణలు చేయిస్తున్నాడని కిరణ్ అన్నారు. జగన్ రెడ్డిని చిట్టి రెడ్డి అని.. భూమన కుటుంబంపై విమర్సలు చేసినందుకే తన పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని కిరణ్ రాయల్ హెచ్చరించారు.
వైరల్ అవుతున్న వీడియో
కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికి పైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి తనను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు మహిళ పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు సాయం చేయండని వేడుకున్నారు. కిరణ్ రాయల్ అసలు నైజం మొత్తం వివరిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే జనసేన ఇంచార్జీ కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముట్టడించారు. మహిళను మోసం చేసిన కిరణ్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.
Also Read : Dhar Gang Crime: 4 రాష్ట్రాలను వణికిస్తున్న ధార్ గ్యాంగ్ అరెస్ట్ - భారీగా బంగారం, నగదు స్వాధీనం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

