Crime News: రేషన్ కార్డు కావాలా? నీ కూతుర్ని పంపు! తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం
Anantapur Crime News | అనంత జిల్లా తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం. రేషన్ కార్డు కావాలా? నీ కూతుర్ని పంపు! అన్న కీచకపర్వం ఆలస్యంగా వెలుగు చూసింది.

రేషన్ కార్డు కావాలా? నీ కూతుర్ని పంపు! తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం
తాడిపత్రిటౌన్: 'రేషన్ కార్డు కావాలంటే నీ కూతురిని నా దగ్గరకు పంపించు' అన్న ఓ వీఆర్వో కీచకపర్వం ఆలస్యంగా వెలుగు చూసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్దురాలు తన వేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్గా మారింది. దీంతో అధికారులు ఆ కీచక వీఆర్వోపై విచారణ చేపట్టారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్ కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్ను బతిమాలుతూ వస్తోంది. తాడిపత్రి మునిసిపల్ అధికారులకూ విన్నవించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చం ద్రశేఖర్ 'నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్ కార్డు ఇప్పి స్తా' అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అనంతపురం ఆర్డీవో కేశవనాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాడిపత్రి తహసీల్దార్ రజాక్ వలి శుక్రవారం నాగమునెమ్మను తన కార్యాలయానికి పిలిచి విచారించి.. నివేదికను ఆర్డీవోకు అందించారు.
🚨 #KutamiFiles
— YSR Congress Party (@YSRCParty) February 9, 2025
నీ కూతురుని నా దగ్గరకు పంపితేనే.. రేషన్ కార్డు ఇప్పిస్తానన్న వీఆర్వో
అనంతపురం జిల్లాలో భర్త లేని ఓ మహిళ, తన బిడ్డతో కలిసి రేషన్ కార్డు కోసం దరఖాస్తు.. కానీ రేషన్ కార్డు ఇవ్వాలంటే తన కోరిక తీర్చమన్న తాడిపత్రి పట్టణంలోని వీఆర్వో చంద్రశేఖర్
వీఆర్వో ఆగడాల్ని… pic.twitter.com/i3xTJ8xUi9





















