అన్వేషించండి
Yodha Premiere Show : యోధ ప్రీమియర్‌కు బ్యాక్ లెస్ గౌన్‌లో వచ్చిన దిశా పటానీ.. ఫ్యామిలీతో వచ్చిన సిద్ధార్థ్ మల్హోత్ర
Disha Patanai and Siddarth Malhotra : సిద్ధార్థ్ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ నటించిన చిత్రం యోధ. ఈ సినిమా ప్రీమియర్ షోకు దిశా స్టన్నింగ్ ఔట్ఫిట్తో రాగా.. సిద్ధార్థ్ ఫ్యామిలీతో వచ్చాడు.

యోధ ప్రీమియర్ షోలో దిశా పటానీ, సిద్ధార్థ్ మల్హోత్ర ఫ్యామిలీ
1/7

సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా.. రాశీ ఖన్నా హీరోయిన్గా.. దిశా పటనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యోధ. యాక్షన్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్ర ప్రీమియర్ షోకు దిశా, సిద్ధార్థ్ హాజరయ్యారు.
2/7

యోధ సినిమా ప్రీమియర్‌కు సిద్ధార్థ్ తన ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. తన ఫాదర్‌ని వీల్ చైర్లో తీసుకుని వచ్చాడు. తన తల్లితోపాటు.. భార్య కియారా అడ్వానీ కూడా ఈ షోకు వచ్చారు.
3/7

బాలీవుడ్ బ్యూటీఫుల్ హిట్ పెయిర్లో సిద్ధార్థ్, కియారా ఉంటారు. వీరిద్దరూ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా హిట్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కపుల్స్ గోల్స్ ఇస్తూనే ఉంటారు.
4/7

యోధ ప్రీమియర్ షోకు సిద్ధార్థ్ బ్లాక్ డెనిమ్ జీన్స్, షర్ట్, లెదర్ జాకెట్‌తో వచ్చాడు. బ్రౌన్ షూతో తన లుక్‌ని సెట్ చేసుకున్నాడు. కియారా బ్లూ కలర్ షూట్లో చాలా హుందాగా కనిపించింది.
5/7

యోధ ప్రీమియర్ షోకి దిశా పటానీ బ్యూటీఫుల్ అవుట్‌ఫిట్‌లో వచ్చింది. వైట్ కలర్ బ్యాక్ లెస్ డ్రెస్‌తో షోకు అటెండ్ అయింది.
6/7

మెడలో కలర్ బీడ్స్ నెక్లెస్ వేసుకుని.. సింపుల్ హెయిర్ స్టైల్‌తో ముస్తాబైంది. ఆయిల్ మేకప్ లుక్‌లో పెదాలకు రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని ఈ భామ ఫోటోలకు ఫోజులిచ్చింది.
7/7

సిద్ధార్థ్ మల్హోత్ర, దిశా పటానీ మొదటిసారి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు. రాశీ ఖన్నా కూడా సిద్ధార్థ్‌తో మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. కానీ దిశా.. సిద్ధార్థ్ భార్య కియారా అడ్వానీతో ఎమ్ ఎస్ ధోని సినిమాలో నటించింది. కెరీర్ పరంగా వీరిద్దరికీ ఎమ్ ఎస్ ధోని బ్రేక్ ఇచ్చింది.
Published at : 15 Mar 2024 04:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion