అన్వేషించండి
Anchor Geetha Bhagath: గీతా భగత్... స్కిన్ షోకి దూరం, ప్రాసల్లో బుల్లితెర త్రివిక్రమ్ - పద్ధతిగా యాంకరింగ్ చేసే పాప
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇప్పుడు యాంకర్లకు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఏర్పడుతోంది. అటువంటి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న యాంకర్లలో గీతా భగత్ ఒకరు. (Image Courtesy: Anchor Geetha Bhagath)

గీతా భగత్ (Image Courtesy: Anchor Geetha Bhagath)
1/6

సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కావచ్చు లేదంటే టీజర్ / ట్రైలర్ లాంచ్ కావచ్చు... సినీ తారలతో ఇంటర్వ్యూలు కావచ్చు... ప్రోగ్రాం ఏదైనా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే యాంకర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ యాంకర్లు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రేక్షకుల్లో అభిమానుల్ని సొంతం చేసుకుంటున్నారు యాంకర్లు. అటువంటి తెలుగు యాంకర్లలో గీతా భగత్ ఒకరు. (Image Courtesy: Anchor Geetha Bhagath)
2/6

యంగ్ తెలుగు యాంకర్లు అందరిలో గీతా భగత్ రూట్ సపరేట్. మాటల్లో, దుస్తుల్లో, వేసే పంచ్ డైలాగుల్లో పద్ధతి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. యంగ్ యాంకర్లు అందాల ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్లు చేస్తుంటే... అందుకు కంప్లీట్ అపోజిట్ గీతా భగత్. ఆవిడ ఎప్పుడూ హద్దు మీరింది లేదు. సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు. మోడ్రన్ డ్రస్ వేసినా ఎక్స్‌పోజింగ్ వంటి వాటికి ఆమె దూరం (Image Courtesy: Anchor Geetha Bhagath)
3/6

స్కిన్ షోకు దూరంగా ఉండే గీతా భగత్... తన మాటలతో కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. సుమ, ఝాన్సీ తరహాలో యాంకరింగ్ చేసే ఈ జనరేషన్ అమ్మాయి ఎవరంటే గీతా భగత్ ముందు గుర్తుకు వస్తారు. (Image Courtesy: Anchor Geetha Bhagath)
4/6

గీతా భగత్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే మరొక అంశం... ఆవిడ స్పాంటేనిటీ. అసలు తడుముకోకుండా పంచ్ డైలాగ్స్ వేయడంలో ఆమె దిట్ట. ఆ మధ్య 'ఓం భీమ్ బుష్'లో రచ్చ రవి వెకిలి కామెడీ చేయబోతే పద్ధతిగా పంచ్ వేశారు. ఇక ప్రాసలతో డైలాగ్స్ వేస్తూ ప్రోగ్రాం నడిపించడంలో ఆమె బుల్లితెర త్రివిక్రమ్ అని చెప్పాలి. (Image Courtesy: Anchor Geetha Bhagath)
5/6

సెలబ్రిటీలను నొప్పించే ప్రశ్నలు అడగకుండా సినిమాకు సంబందించిన ఆసక్తికర విశేషాలు రాబట్టడంలో గీతా భగత్ స్పెషలిస్ట్. యాంకర్లు కూడా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్న ఈ రోజుల్లో... ఇలా కూడా యాంకరింగ్ చేయవచ్చని చూపిస్తూ... ఈ రంగంలో ప్రవేశించాలనుకునే కొత్తవారికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు గీతా భగత్. వివాదాలకు దూరంగా ఉండే గీతా భగత్ ఇప్పుడు యాంకరింగ్ లో ఫుల్ బిజీ. ఆమెకు డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. (Image Courtesy: Anchor Geetha Bhagath)
6/6

గీతా భగత్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: Anchor Geetha Bhagath)
Published at : 30 Apr 2024 03:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion