US President Donald Trump News: ఇండియా అభివృద్ధికి అమెరికా ఎందుకు సాయం చేయాలి- మోదీ ఫోన్ చేసిన రోజే షాక్ ఇచ్చిన ట్రంప్
US President Donald Trump News: అమెరికన్ పౌరులకు ఆదాయపు పన్ను రద్దు చేసి ఇండియా. చైనా, బ్రెజిల్ దేశాలపై సుంకం వేయబోతున్నట్టు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
America News: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛగా ఖర్చు పెట్టి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పంపేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశానికి ఎక్కువ ఆదాయం వచ్చే ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి అమెరికా పౌరులకు విముక్తి కల్పించబోతున్నట్టు వెల్లడించారు.
అమెరికాలో ఎక్కువ ఆదాయం ఇన్‌కమ్ ట్యాక్స్ ద్వారానే వస్తోంది. ఇలాంటి పన్నును ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్టు ప్రకటించారు. కేవలం అమెరికాలో పుట్టిన పౌరులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే దేశ పౌరులపై వేయాల్సిన పన్నును వేరే దేశాలపై వేస్తే ఎలా ఉంటుందని అన్నారు. వేరే దేశాల బాగు కోసం అమెరికా పౌరులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ట్రంప్ ప్రశ్నించారు.
అమెరికాలో పౌరుల ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకుంటూ దేశ వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలని ట్రంప్ సూచించారు. ఆ దిశగానే చర్యలు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. పూర్వకాలంలో ప్రపంచంలోనే అమెరికా ప్రజలు అత్యధిక సంపద కలిగి ఉండేవారని అన్నారు. అప్పట్లో ఉన్న సుంకాల ఆధారిక ఆర్థిక వ్యవస్థే ఆ పరిస్థితికి కారణమైందని గుర్తు చేశారు. అలాంటి వ్యవస్థను మళ్లీ పునరుద్దరించాల్సిన అవసరం ఉందనిపేర్కొన్నారు.
Also Read: ట్రంప్‌తో ఫోటో కోసం పది కోట్లు పైనే కట్టిన అంబానీ దంపతులు - కుబేరుడైనా టిక్కెట్ కొనాల్సిందే
అమెరికాకు పోటీగా ఉన్న దేశాలపై సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చైనా, ఇండియా, బ్రెజిల్‌లను ప్రత్యేక కేటగిరి కింద చేర్చారు. సోమవారం ఫ్లోరిడాలో ట్రంప్ మాట్లాడుతూ.. 'విదేశాలు నిజంగా మనకు పోటీ వస్తున్న దేశాల వ్యక్తులపై సుంకాలు విధించబోతున్నాము. వారి ఉద్దేశం మనకు హాని కలిగించే ఉద్దేశం లేకపోవచ్చు కానీ వారు ముఖ్యంగా తమ దేశాన్ని బాగు చేయాలని కోరుకుంటారు.'' అని అన్నారు. ''ఇతర దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి. చైనా చాలా ఎక్కువ రుసుములు వసూలు చేస్తుంది. భారతదేశం, బ్రెజిల్ అనేక ఇతర దేశాలు కూడా అదే చేస్తున్నాయి. అందుకే అదే పంథాలో అమెరికాను అగ్రగామిగా తీసుకెళ్తాం. అమెరికా చాలా న్యాయమైన వ్యవస్థను నెలకొల్పుతుంది, ఇతర ప్రాంతాల్లో ఉన్న డబ్బు మన ఖజానాలోకి వస్తుందని, అమెరికా మళ్లీ చాలా సుభిక్షంగా మారుతుందని ఆయన అన్నారు.
"ఇతర దేశాలను ధనవంతులుగా చేయడానికి మన పౌరులపై పన్ను విధించే బదులు, మన సొంత పౌరులను ధనవంతులుగా చేయడానికి ఇతర దేశాలపై పన్ను విధించాలి" అని ట్రంప్ తన తొలి ప్రసంగంలో అన్నారు. ఇతర దేశాలపై సుంకాలు పెరిగేకొద్దీ, అమెరికన్ కార్మికులు వ్యాపారాలపై పన్నులు తగ్గుతాయి. సుంకాలను తప్పించుకోవాలంటే అమెరికాకు వచ్చి మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని కంపెనీలకు ట్రంప్ సూచించారు. అన్నట్టుగానే ఇప్పుడు ఆ నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తున్నారు.
Also Read: డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే!