Mukesh Ambani Couple: ట్రంప్‌తో ఫోటో కోసం పది కోట్లు పైనే కట్టిన అంబానీ దంపతులు - కుబేరుడైనా టిక్కెట్ కొనాల్సిందే
Trump Inauguration: ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖేష్ అంబానీ దంపతుల ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటో దిగడానికి పది కోట్లకుపైగా ఖర్చు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
Mukesh Ambani couple went viral during Trump swearing in ceremony: అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టే ముందు ట్రంప్ ఇచ్చిన ఇనాగరేషన్ విందులో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.వారందర్నీ ట్రంప్ గౌరవంగా ఆహ్వానించారని అనుకున్నారు. అందులో భారత్ నుంచి ముఖేష్ అంబానీ దంపతులు కూడా పాల్గొన్నారు. వారితో కలిసి ట్రంప్ ఫోటో కూడా దిగారు. ఆ ఫోటో వైరల్ అయింది. ప్రపంచంలో అత్యంత కుబేరుల్లో ఒకరు కాబట్టి ట్రంప్ నుంచి ముకేష్ అంబానీ దంపతులకు ఆహ్వానిం వచ్చి ఉంటుందని అనుకుంటారు.
నిజానికి ట్రంప్ ఇనాగరేషన్ విందులో పాల్గొన్న ఎవరికీ ఆహ్వానం ఉండదు. వారు విరాళం ఇచ్చి ఆ విందులో పాల్గొనేందుకు టిక్కెట్ కొనుక్కోవాలి. ట్రంప్ తో కలిసి విందులో పాల్గొని ఫోటో దిగాలంటే మినిమం మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది ప్రాథమిక విరాళం మాత్రమే. ఇంకా ఎక్కువ విరాళం ఇస్తే మరింత సన్నిహితంగా ట్రంప్ తో ఉండేలా సీట్లు లభిస్తాయని చెబుతున్నారు. పది లక్షల డాలర్లు అంటే.. మన కరెన్సీలో ఎనిమిదిన్నర కోట్లు పైనే. ముకేష్ అంబానీ కాబట్టి ఇంకా ఎక్కువ విరాళం ఇచ్చి ఉంటారని అనుకోవచ్చు. అంటే పది కోట్లపైనే ఆయనకు ఖర్చు అయి ఉంటాయని అనుకోవచ్చు.
At the Private Reception in Washington, Mrs. Nita and Mr. Mukesh Ambani extended their congratulations to President-Elect Mr. Donald Trump ahead of his inauguration.
— Reliance Industries Limited (@RIL_Updates) January 19, 2025
With a shared optimism for deeper India-US relations, they wished him a transformative term of leadership, paving… pic.twitter.com/XXm2Sj74vX
ట్రంప్ ఇనాగరేషన్ విందు ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లాంటిదే. అగ్రరాజ్యానికి ఫండ్ రైజింగ్ ఎందుకని అనుకోవచ్చు.కానీ ప్రమాణ స్వీకార ఖర్చులు కూడా.. ఇలానే సంపాదించుకుంటారు. ఒక్క ముకేష్ అంబానీ కాదు.. కాబోయే ప్రెసిడెంట్ తో పరిచయాలు పెంచుకోవాలనుకునే పారిశ్రామిక వేత్తలంతా ఈ ఇనాగరేషన్ విందులో పాల్గొనేందుకు టిక్కెట్లు కొంటారు. ఇక్కడో ట్విస్ట్ ఏమిటంటే ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లో అధ్యక్ష పదవికి పోటీ పడక ముందు ఈ ఇనాగరేషన్ విందులకు విరాళం ఇచ్చి వచ్చేవారని చెబుతారు. ఇప్పుడు ఆయనే అధ్యక్షుడు అయ్యారు. ఆయనతో విందుకు ఇతరులు టిక్కెట్లు కొనుగోలు చేసి వస్తున్నారు.
ముకేష్ అంబానీ .. తమ వ్యాపారాలను అమెరికాలో విస్తరించాలని అనుకుంటున్నారో లేదో కానీ ట్రంప్ తో ఇనాగరేషన్ విందుకు ప్రత్యేకంగా హాజరయ్యారు. నీతా అంబానీ భారతీయ ఆహార్యంలో అందర్నీ ఆకట్టుకున్నారు.
Also Read: ఢిల్లీ ఎన్నికల్లో జోరుగా తెలుగు నేతల ప్రచారం - కూటమి అగ్రనేతలు కూడా క్యూ కడతారా ?