Syria Civil War: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
సిరియా లో అంతర్యుద్ధానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానంగా ఐదు చెప్పుకోవచ్చు. అంతర్గత కారణాలతో పాటు,విదేశీ జోక్యం , మత పరమన విబేధాలు, పాలనా తీరు ఇవన్నీ ప్రధాన కారణాలు
Syria News | ప్రపంచంలోని అత్యంత ప్రాచీన చారిత్రాత్మక దేశాల్లో సిరియా ఒకటి. ఈ దేశానికి టర్కీ, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దు దేశారు. సిరియా అనే పదం ప్రాచీన గ్రీకు భాష నుండి పుట్టింది. సిరియా అష్షూరియ కు అంటే ఇరాక్ లోని కొన్ని ప్రాంతాలు కలుపకుని అష్షూరు సామ్రాజ్యంలో భాగంగా ఒకప్పడు ఉండేది. 2011 నుండి ఈ దేశంలో అంతర్యుద్ధం జరుగుతోంది. సిరియాను 1970 నుండి 2000 వరకు హోఫెజ్ అల్ అసద్ అధ్యక్ష హోదాలో పాలన సాగించాడు. ఆయన కుమారుడే బషర్ హోఫెజ్ అల్ అసద్ . ఆయన్నే బషర్ అల్ అసద్ గా పిలుస్తారు. తండ్రి 2000 సంవత్సరంలో మరణించడంతో బషర్ అల్ అసద్ అధికార పగ్గాలు చెపట్టారు. అంతకు ముందు ఆయన లండన్ లో వైద్య విద్య అభ్యసించి కంటి వైద్యుడిగా పని చేసేవారు. తండ్రి మరణంతో తనకు ఇష్టం లేకున్నా సిరియా పాలక పగ్గాలు స్వీకరించారని చెప్పుకుంటారు.
అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు.
1. సుదీర్ఘ కాలం కుటుంబ పాలన
1970 నుంచి తండ్రి బషర్ హోఫెజ్ అల్ అసద్ నుంచి, 2024 డిసెంబర్ లో బషార్ అల్ అసద్ వరకు కుటుంబ పాలన సాగింది. స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయ హక్కుల కోసం నిరసనలు పెల్లుబికాయి. బషార్ ప్రభుత్వ పాలనలో ఉద్యమం తీవ్ర స్థాయికి పెరిగింది. ప్రజా ఆగ్రహం పెల్లుబికింది. కుటుంబ పాలన వల్ల ప్రజల హక్కులు కాలరాయబడుతున్నాయన్న చర్చ పెద్ద ఎత్తున సిరియాలో సాగింది. బషర్ అల్ అసద్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా సివిల్ వార్ కు దారి తీసింది. అసద్ ను పదవీచ్యుడ్ని చేస్తే తప్ప సిరియాలో స్వేచ్ఛ ఉండదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. దీంతో పెద్దఎత్తున అసద్ కు తిరుగుబాటు సెగలు సిరియాలో తగిలాయి.
2. ఆర్థిక అసమతుల్యత
సిరియాలో ఆర్థిక అసమతుల్యత పెరిగింది. పేదరికం బాగా వృద్ధి చెందింది. నిరుద్యోగం , నిరక్షరాస్యత అధికం. వనరుల కొరత కారణంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. ధనిక, పేద తార్యతమ్యం పెరిగింది. ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున యువత గ్రామాల నుండి పట్టణాలకు వలస బాట పట్టారు. కాని వారికి తగిన ఉపాధి లభించ లేదు. దీంతో యువతలో తీవ్ర అసంతృప్తి పెరిగింది. 2006 నుండి 2011 వరకు పంటల ఉత్పత్తి తగ్గిపోయింది . నీటి కొరత వల్ల పంటలు వేసుకులేని పరిస్థితి అక్కడి రైతులది. దీంతో గ్రామాల్లో ప్రజలు నివసించలేని పరిస్థితి. అయిల్ ధరల్లో మార్పుల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. పేద కుటుంబాలు ఆహారానికి ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి. ప్రభుత్వ అవినీతి పాలక విధానాల కారణంగా సిరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ కారణంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పాలక పక్షంపై పెల్లుబికింది.
3. మతపరమైన ఉద్రిక్తతలు
సిరియాలో అంతర్గత సంక్షోభానికి రాజకీయ, ఆర్థిక కారణాలు ప్రధానమైనప్పటికీ మత పరమైన అంశాలు దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సిరియాలో ప్రధానంగా సున్నీ ముస్లింలు 70 శాతం ఉంటారు. షియా ముస్లింలు అందులో అలవీట్ల వర్గం వారు 13 శాతం మంది మాత్రమే. సిరియా అధ్యక్షుడిగా ఉన్న బషర్ అల్ అసద్ ఈ వర్గం వాడే. సిరియన్ ముస్లింలలో మైనార్టీ వర్గం వాడైన అల్ అసద్ సిరియా పాలకుడిగా ఉండటం సున్నీ పెద్దలకు నచ్ఛని అంశం. ఈ కారణంగా తరచు మత పరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకుండేవి.
4. ఇస్లామిక్ ఉగ్రవాద సంఘాల పాత్ర
సిరియా అంతర్యుద్ధంలో సిరియన్ ప్రజలతో పాటు ఇస్లామిక్ సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఇందులో ప్రధానమైంది ఐసీస్. 2013లో ఈ ఉగ్రవాద సంస్థ సిరియాలో అడుగుపెట్టి సున్నీ అనుకూల సంస్థ. అయితే ఐసీసీ సిరియాలో ఉగ్రవాద భావజాలంతో షియాలకు, అలవీట్లకు వ్యతిరేకంగా హింసాత్మక కార్యక్రమాలను నిర్వహించింది. ముస్లిం రాజ్య స్థాపనే ప్రధాన ఎజెండాగా ఈ సంస్థ డమస్కాస్, అలెపో వంటి నగరాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే వీరికి వ్యతిరేకంగా సిరియా తో పాటు రష్యా,అమెరికా, టర్కీ, సౌదీ అరెబియా, ఇరాన్ పోరాడి చెక్ పెట్టారు. దీంతో 2019 నాటికి ఐసీస్ ను తుడిచి పెట్టేశారు.
ప్రస్తుతం ఐసీస్ (ISIS)కి ఉనికి ఉన్నా అదంత పెద్ద ప్రభావంతమైంది కాదు. ఆ తర్వాత ఆల్ ఖైదా అనుబంధ సంస్థ ఆల్ నుస్త్రా ఫ్రంట్ ఇది బషర్ ఆల్ అసద్ కు వ్యతిరేకంగా పని చేసిన ఉగ్రవాద సంస్థ. సున్నీ పాలన కోసం ఆల్ ఖైదా కూడా తీవ్రంగా ఇక్కడ పని చేస్తోంది. సోమాలియాకు చెందిన ఆల్ షబాబ్ ఉగ్ర సంస్థ ఇక్కడ ముస్లిం లా అమలుకు పని చేస్తోంది. ఇస్లామిక్ మోఖా ఫ్రంట్ ఇది కూడా సున్ని ఉగ్రవాద సంస్థ. సిరియా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా పని చేస్తోన్న సంస్థ. వీటితో పాటు టర్కీ ప్రేరత ఉగ్రవాద సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ బషర్ కు వ్యతిరేకంగా ప్రజల్లో పని చేసాయి. వీటి ప్రభావం వల్ల సిరియాలో అంతర్యుద్ధం మరో స్థాయికి చేరడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
5. విదేశాల జోక్యం
సిరియాలో రష్యా, అమెరికా, ఇరాన్, టర్కీ, సౌదీ అరెబియాలు తమ తమ వ్యూహాల ప్రకారం పనిచేయడం కూడా సిరియా అంతర్యుద్ధానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తమ ప్రయోజనాలు, తమ భద్రతా దృష్టితో ఈ దేశాలు సిరియాలో అంతర్గత జోక్యం చేసుకున్నాయి. 2011 నుండి ఆయా దేశాలు తమ ప్రయోజనాలే ముఖ్యంగా సిరియాను వాడుకున్నాయనడంలో సందేహం లేదు.
Also Read: Canada Crime: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య - ఇద్దరు అనుమానితుల అరెస్ట్, అసలేం జరుగుతోంది?
అమెరికా
సిరియా లోని బషర్ ఆల్ అసద్ ప్రభుత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకోవాలని అమెరికా ఆకాంక్షించింది. ఇందు కోసం బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తోన్న సున్నీ దళాలకు అంటే సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్, ఫ్రీ సిరియన్ ఆర్మీ వంటి సంస్థలకు మద్ధతు ఇచ్చింది. ఐసీస్ ను తుడిచిపెట్టడానికి ఇతర దేశాలతో కలిసి సిరియాపై అమెరికా తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది.
రష్యా
బషర్ ఆల్ అసద్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు నిలబెట్టింది రష్యానే. సిరియాలోని ఐసీస్, సున్నీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా రష్యా వైమానికి దాడులు సహా అన్ని రకాల మద్ధతు ఇచ్చింది. ప్రభుత్వ సైనిక శక్తిని పెంచేలా కీలక నిర్ణయాలను రష్యా తీసుకుంది. ఇదంతా తన ప్రయోజనాలు, వీటి తో పాటు అమెరికా దేశాల ప్రభావం లేకుండ చేసేందుకు రష్యా సిరియాను పావుగా వాడుకుందనే చెప్పాలి. మిడిల్ ఈస్ట్ లో తన ప్రభావం ఉండాలంటే సిరియాలో బషర్ ఆల్ అసద్ ప్రభుత్వం అవసరం. ఈ కోణంలో రష్యా సిరియాలో తన ప్రభావం కోసం పని చేసింది.
ఇరాన్ ఇరాన్ కూడా బషర్ ఆ్ అసద్ ప్రభుత్వానికి తన మద్ధతు ఇచ్చింది. ముఖ్యంగా ఇరాన్ మద్ధతు ఉన్న హెజ్బుల్లా , ఇరాన్ షియాఉగ్ర వాద సంస్థలు సిరియాలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. సున్నీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాయి. ఇరాన్ చర్యలన్నీ షియా వర్గాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయి.
టర్కీ
టర్మీ సున్నీ మద్ధతుగా ఉన్న సిరియన్ రెబెల్స్ కు, ఫ్రీ సిరియన్ ఆర్మీ , సినియర్ మానిటరింగ్ గ్రూప్ వంటి సంస్థలకు మద్ధతు గా ఉంటా బషర్ ఆల్ అసద్ కు వ్యతిరేకంగా పని చేసింది. ఐసీస్ కు వ్యతిరేకంగా టర్కీ పోరాడినప్పటికీ కుర్దు మిలిటెంట్ , సిరియన్ కుర్దీష్ ఫోర్సెస్ ద్వారా సున్ని మత వర్గాలను బలోపేతం చేసేలా టర్కీ వ్యవహరించింది.
సౌదీ అరేబియా
సౌదీ అరెబియా బషర్ ఆల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించింది. సున్నీ ప్రధాన దేశం సౌదీ , దీంతో బషర్ వ్యతిరేక శక్తులకు మద్ధతుగా నిలిచింది.
ఖతార్
కతార్ కూాడా సున్నీ దేశం. సిరియాలోని సున్నీ మద్ధతు దారులకు అన్ని విధాలుగా సాయం అందించింది. ఫ్రీ సిరియన్ ఆర్మీకి మద్ధతు ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక సున్నీ సంస్థలకు ఆర్థికంగా అన్ని విధాలుగా సాయం చేసింది.
ఇలా అమెరికా, రష్యాలు తమ అంతర్జాతీయ ప్రయోజనాల కోసం పని చేయగా ఇక ఇరాన్, టర్కీ, సౌదీ అరెబియా, కతార్ వంటి దేశాలు సున్నీ , షియా వర్గ ప్రయోజనాల కోసం పని చేశాయి. ఇలా సిరియాలో అంతర్యుద్ధానికి వీరందరి పాత్ర ఉంది. ఇలా ఐదు ప్రధాన కారణాలతో సిరియా అంతర్యుద్ధంతో అట్టుడికిపోయింది.