Delmicron Varient: ఒమిక్రాన్ వెంటే పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!
పశ్చిమ దేశాల్లో డెల్మిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉంటోంది. డెల్మిక్రాన్ అనేది కోవిడ్ యొక్క డబుల్ వేరియంట్. కరోనా డెల్టా వేరియంట్, ఓమిక్రాన్ వేరియంట్ పేర్లను కలపడం ద్వారా ఈ డెల్మిక్రాన్ పేరు వచ్చింది.
ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం సునామీలా విరుచుకుపడుతోంది. భారత్‌లోనూ దీని ప్రభావం ఇటీవలే మొదలు కాగా.. వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. కొవిడ్‌లో డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తిచెందుతున్నప్పటికీ.. వైరస్ రూపాంతరం చెందే క్రమంలో మరో వేరియంట్ ప్రమాదం కూడా పొంచి ఉంది. అదే డెల్మిక్రాన్ వేరియంట్.
డెల్మిక్రాన్ వేరియంట్ అంటే..
పశ్చిమ దేశాల్లో డెల్మిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉంటోంది. డెల్మిక్రాన్ అనేది కోవిడ్ యొక్క డబుల్ వేరియంట్. కరోనా డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ పేర్లను కలపడం ద్వారా ఈ డెల్మిక్రాన్ పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్‌లు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.
Also Read: Goodbye 2021: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!
‘‘యూరప్ దేశాలు, అమెరికాలో కొద్ది నెలల నుంచి డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌ల నుంచి ఏర్పడ్డ డెల్మిక్రాన్ కేసులు ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే, గత డెల్టా వేరియంట్‌కు తీవ్రంగా ప్రభావితమైన మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్‌కు సంబంధించి ప్రభావం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లో ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్‌ను వేగంగా రీప్లేస్ చేస్తోంది. కానీ, ఈ డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌లు భవిష్యత్తులో ఎలా రూపాంతరం చెంది ఏ మేర ప్రభావం కలిగిస్తాయనే అంశంపై ఇంకా ఎలాంటి అంచనాలు లేవు.’’ అని కొవిడ్‌పై ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ సభ్యుడు శశాంక్ జోషి వెల్లడించారు.
ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివీ..
ఒమిక్రాన్ వేరియంట్, దాని తీవ్రతలో కచ్చితత్వం కోసం పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. అయితే, ఒమిక్రాన్ సోకిన వారిలో నాలుగు సాధారణ లక్షణాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దగ్గు, అలసట, ముక్కు కారడం లాంటివి కనిపిస్తున్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పర్కొన్న కొవిడ్ లక్షణాల జాబితాలో ఈ వేరియంట్ వల్ల కండరాలు లేదా ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వికారం లేదా వాంతులు, విరేచనాలు కూడా ఉన్నాయి.
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
ఒమిక్రాన్‌కు చికిత్స ఎలాగంటే..
కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి తనకు జరిగిన చికిత్స, తాను కోలుకునే విధానం గురించి వివరాలను ఓ జాతీయ వార్తాసంస్థతో పంచుకున్నాడు. ‘‘ఒమిక్రాన్ వేరియంట్‌కు ప్రత్యేక చికిత్స అంటూ ఏం లేదు. విటమిన్ - సి మాత్రలు, యాంటీబయాటిక్స్ ఇచ్చారు. నాకు అలసట లేదు. లక్షణాలు చాలా తక్కువగా ఉన్నందున, నేను ఒక వారం పాటు ఆసుపత్రి వార్డు నుంచి ఆఫీస్ పని పని చేశాను’’ అని ఆయన చెప్పినట్లు వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ వెల్లడించింది.
మరోవైపు, జనవరి, ఫిబ్రవరిలో నెలల్లో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల అత్యధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటించాలని, వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.
Also Read: Christmas 2021: 30ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తెరుచుకున్న చర్చి... క్రిస్మస్ వేళ అరుదైన దృశ్యం...
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,317 మందికి కరోనా.. 213కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి