Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా

సెలబ్రేటీ జంటలు విడిపోతే.. భరణం పెద్ద మెుత్తంలో ఉంటుంది. అలాంటిది దుబాయ్ రాజు విషయంలో మమూలుగా ఉంటుందా?

FOLLOW US: 

దుబాయ్ రాజుకు తన భార్యతో విడాకులు అయ్యాయి. అయితే భరణం పెద్ద మెుత్తంలో చెల్లించాలని చెప్పింది బ్రిటన్ కోర్టు. భారీగా భరణం అంటే.. 100 కోట్లో..., 200 కోట్లో కాదు.. రూ.5,555 కోట్లు. దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం విషయంలో బ్రిటన్ హైకోర్టు ఇలాంటి షాకింగ్ తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత ఖరీదైన భరణంగా చెబుతున్నారు.

దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్.. పెళ్లి చేసుకున్న జోర్డాన్‌ రాకుమారి హయా బింత్‌ అల్‌ హుసేన్‌కు.., వీరి పిల్లలకు  రూ.5,555 కోట్లు (554 మిలియన్‌ పౌండ్లు) భరణంగా చెల్లించాలంటూ..  బ్రిటన్ కోర్టు తీర్పు  ఇచ్చింది. రాజు చెల్లించాల్సిన మెుత్తంలో.. రూ.2,521 కోట్లు మాజీ భార్యకు మూడు నెలల్లోపు ఇవ్వాలి. రూ.2,907 కోట్లు పిల్లలైన అల్‌ జలీలా, జయేద్‌కు బ్యాంకు గ్యారంటీతో చెల్లించేయాలి. 

అయితే పిల్లలకు ఇచ్చే దాంట్లో.. తండ్రితో.. వారికున్న సంబంధాలపై.. ఆధారపడి ఉంటుంది అని.. కోర్టు చెప్పింది. భరణమే కాదు.. తీర్పు చెబుతూ.. న్యాయమూర్తి ఫిలిప్‌ మూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాకుమారి హయా, ఆమె పిల్లలకు ఇతరుల కంటే.. భర్త షేక్ మహమ్మద్ నుంచే.. ప్రమాదం ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రిగా కూడా వ్యవహరిస్తున్న దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌. రాజకుమారితోపాటు ఆమె తరఫున న్యాయవాదుల ఫోన్లను ‘పెగాసస్‌ స్పైవేర్‌’ సాయంతో షేక్ మహమ్మద్ హ్యాకింగ్‌ చేయించాడని బ్రిటిష్‌ ఫ్యామిలీ కోర్టు కిందటి.. అక్టోబరులో నిర్ధారించింది. అయితే ఈ విషయాన్ని దుబాయ్ రాజు ఖండించారు.

ఏమైందంటే.. 

రాకుమారి హయాకు చెందిన బాడీగార్డ్స్ లో ఒకరితో సన్నిహితంగా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే 2019 ఏప్రిల్‌లో ఆమె దుబాయ్‌ నుంచి లండన్‌కు వచ్చారు. షేక్ మహమ్మద్ తో తనకు.. విడాకులు కావాలని.. పిల్లలను అప్పగించాలని.. బ్రిటిష్ కోర్టును ఆశ్రయించారు.  తన భర్త నుంచి తనకు ముప్పు ఉందని.. కుమార్తెలను బలవంతంగానైనా.. గల్ఫ్ ఎమిరేట్ కు రప్పించాలని చూస్తున్నారని తెలిపారు.

Also Read: Goodbye 2021: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!

Also Read: Fisherman: అదృష్టమంటే నీదేనయ్యా.. సముద్రంలో చేపలకు గాలం వేస్తే నిధే దొరికినట్టు ఉందిగా!

Also Read: అండర్‌వేర్‌ను మాస్కులా పెట్టుకుని విమానమెక్కాడు.. ఆ తర్వాత ఏమైందో చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Dec 2021 07:22 PM (IST) Tags: UK court orders Dubai ruler Dubai King divorce settlement UK court On Dubai King biggest divorce case settlement Sheikh Mohammed bin Rashid Al-Maktoum Princess Haya Bint Al Hussein

సంబంధిత కథనాలు

UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన

UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన

Viral Video: మీరు క్యాచ్‌లు బాగా పడతారా? అయితే గిన్నిస్ రికార్డ్ కొట్టేయొచ్చు!

Viral Video: మీరు క్యాచ్‌లు బాగా పడతారా? అయితే గిన్నిస్ రికార్డ్ కొట్టేయొచ్చు!

Russia-Ukraine War: పుతిన్ కనుక ఓ మహిళ అయి ఉంటే: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Russia-Ukraine War: పుతిన్ కనుక ఓ మహిళ అయి ఉంటే: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

G7 Summit: భారత కళా నైపుణ్యాన్ని చాటి చెప్పిన మోదీ- జీ7 దేశాధినేతలకు అరుదైన బహుమతులు

G7 Summit: భారత కళా నైపుణ్యాన్ని చాటి చెప్పిన మోదీ- జీ7 దేశాధినేతలకు అరుదైన బహుమతులు

The Diary of a Young Girl : హిట్లర్‌పై అసలైన గెలుపు ఈ చిన్నారిదే ! ఇది కథ కాదు

The Diary of a Young Girl : హిట్లర్‌పై అసలైన గెలుపు ఈ చిన్నారిదే ! ఇది కథ కాదు

టాప్ స్టోరీస్

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !

AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు

PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు