By: ABP Desam | Published : 17 Dec 2021 08:16 PM (IST)|Updated : 17 Dec 2021 08:30 PM (IST)
Image Credit: @Channing_TV/Twitter
కోవిడ్-19 డెల్టా వేరియెంట్ ఏ స్థాయిలో ప్రాణాలు హరించిందో తెలిసిందే. తాజాగా ఒమిక్రాన్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇవన్నీ తెలిసినా.. కొందరు మాత్రం మూర్ఖంగా మాస్కులు లేకుండా తిరిగేస్తూ.. వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ప్రస్తుతం ఆఫీసులు, స్కూళ్లు కూడా తెరిచే ఉండటంతో వైరస్ ‘పండుగ’ చేసుకుంటోంది. కొందరు కోవిడ్‌కు సంబంధించిన కనీస నియమాలు కూడా పాటించడం లేదు. చివరికి ప్రయాణాల్లో కూడా మాస్క్ ధరించడం లేదు. తాజాగా ఓ వ్యక్తి మాస్క్‌కు బదులు అమ్మాయిలు ధరించే అండర్ వేర్‌తో మూతిని కవర్ చేసుకుని విమానం ఎక్కాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆడమ్ జెన్నె అనే వ్యక్తి స్కాట్‌ల్యాండ్‌లోని లాడర్డేల్ ఎయిర్‌పోర్ట్‌లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కాడు. మాస్క్‌కు బదులుగా అండర్‌వేర్‌ను ముఖానికి పెట్టుకున్నాడు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రూల్స్‌లో సూచించిన మాస్క్‌ను మాత్రమే ధరించాలని, లేకపోతే విమానంలో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వబోమని హెచ్చరించింది. దీంతో అతడు.. ‘‘ఇది (అండర్‌వేర్) కూడా మాస్క్‌లాగానే పనిచేస్తుంది. వైరస్‌ను అడ్డుకుంటుంది’’ అని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అతడిని విమానం నుంచి దించేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ పూర్తయ్యేవరకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్వీస్ విమానాలను ఎక్కడానికి వీలు లేకుండా అతడిపై బ్యాన్ విధించారు.
LEAVE IT TO THE #FLORIDAMAN! This guy from Cape Coral tried wearing a #thong as a #mask on a United flight in Fort Lauderdale today. He was kicked off the plane. TSA and sheriff were called but passengers remained peaceful. #airtravel #Florida #aviation #travel pic.twitter.com/kUnkXrgTY8
— Channing Frampton (@Channing_TV) December 16, 2021
ఈ ఘటనపై జెన్నే ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘విమానయాన సంస్థలు మాస్కులు పెట్టుకోవాలని ప్రయాణికులను బలవంతం చేస్తున్నాయి. కానీ, విమానంలో ప్రయాణిస్తూ.. ఆహారం, పానీయాలు తాగేందుకు మాస్క్ తీసినా ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. ఆ సమయంలో కరోనా వైరస్ సోకదా? అని ప్రశ్నించేందుకే నేను అండర్‌వేర్‌ను మాస్క్‌లా ధరించా’’ అని తెలిపాడు. అయితే, అండర్‌వేర్‌ను మాస్క్‌లా ధరించడం ఇదే తొలిసారి కాదని, గత ప్రయాణాల్లో కూడా ఇలా పెట్టుకున్నానని తెలిపాడు. మరి అతడు చేసిన పనిని మీరు సమర్దిస్తారా?
Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?
Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్
Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది
PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?